వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

12-17 ఏళ్ల లోపు వారికి క్లినికల్ ట్రయల్స్.. అనుమతి కోరిన జాన్సన్ అండ్ జాన్సన్

|
Google Oneindia TeluguNews

జాన్స‌న్ అండ్ జాన్స‌న్ కోవిడ్ వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుంది. 12 నుంచి 17 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న వారిలో క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హిచేంందుకు కేంద్ర ప్ర‌భుత్వ అనుమ‌తి కోరింది. త‌మ ద‌ర‌ఖాస్తును మంగ‌ళ‌వారం ప్రభుత్వానికి అంద‌జేసిన‌ట్లు అమెరికా సంస్థ పేర్కొన్న‌ది. క‌రోనా టీకా అంద‌రికీ అందాలని, వీలైనంత త్వ‌ర‌గా చిన్నారుల‌కు కూడా కోవిడ్ టీకా అందేలా చూడాల‌ని జాన్స‌న్ అండ్ జాన్స‌న్ కంపెనీ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. చిన్నారుల‌ టీకాల‌కు యురోపియ‌న్ ఏజెన్సీ అనుమ‌తి దక్కింది. భార‌తీయ ఔష‌ధ నియంత్ర‌ణ సంస్థ కూడా సింగిల్ డోసు జాన్స‌న్ టీకాకు ఓకే చెప్పింది. దీని కోసం హైద‌రాబాద్‌కు చెందిన బ‌యోలాజిక‌ల్ ఈ సంస్థ‌తో ఆ ఫార్మా కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్న‌ది.

గ్లోబల్ హెల్త్ మేజర్లలో ఒకటైన జాన్సన్ & జాన్సన్ వ్యాక్సిన్‌ను పిల్లలకు అందించే విషయమై సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌కి దరఖాస్తు చేసుకుంది. 12 ఏళ్ల నుంచి 17ఏళ్ల వయస్సు గల ఉన్న వారికి కోవిడ్-19 వ్యాక్సిన్‌ను వేసేదానికి సంబంధించి అధ్యయనం చేయడానికి అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకుంది జాన్సన్ & జాన్సన్ కంపెనీ. సింగిల్-షాట్ వ్యాక్సిన్‌కు సంబంధించి క్లినికల్ ట్రయల్స్‌లో వ్యాక్సిన్ 85శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు కంపెనీ చెబుతుంది.

johnson and johnson seeks permission to conduct vaccine trials

కరోనా వైరస్ కట్టడి చేయాలంటే చిన్నారులు సహా అందరికీ వెంటనే వ్యాక్సినేషన్ చేయడం అత్యవసరమని కంపెనీ చెబుతోంది. 12-17 ఏళ్ల వారిపై సింగిల్ డోసు కొవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్​ కోసం కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ అనుమతి కోరుతుంది. పెద్దల కోసం సింగిల్ డోసు జాన్సన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఇదివరకే భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఇచ్చింది.

లేటెస్ట్‌గా దరఖాస్తు చేసుకున్న జాన్సన్ అండ్ జాన్సన్‌కు అనుమతి లభిస్తే భారత్‌లో పిల్లలకు వేసే వ్యాక్సిన్ జాబితాలో ఇది చేరుతుంది. వ్యాక్సిన్ దేశంలో కరోనా వైరస్ నియంత్రణకు ఉపయోగపడుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఇప్పటికే ప్రకటించారు. అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా ఆమోదం లభించిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. కరోనా మహమ్మారిని అంతం చేయడంలో సహాయపడటానికి కొవిడ్-19 వ్యాక్సిన్ ముఖ్యమైన ముందడుగు అని జాన్సన్అండ్ జాన్సన్ ఇండియా ప్రకటించింది.

వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం అయితే ప్రకటించలేదు. డిసిషన్ తీసుకోవాల్సి ఉంది.

ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.

English summary
johnson and johnson seeks permission to conduct vaccine trials. this one is single dose vaccine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X