వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Josh APP:అతిపెద్ద ఆన్‌లైన్ వీడియోతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌‌కు ఎక్కిన షార్ట్ వీడియో యాప్

|
Google Oneindia TeluguNews

జోష్...భారత దేశంలో అత్యంత వేగవంతంగా దూసుకెళుతున్న షార్ట్ వీడియో యాప్. జోష్ యాప్ ప్రారంభమైన ఏడాదిలోపే సరికొత్త చరిత్రను సృష్టించింది. ఎంతో మందికి చేరువైంది. తాజాగా ఈ షార్ట్ వీడియో మేకింగ్ యాప్ ప్రఖ్యాత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాందించింది. ఈ ఘనత సెప్టెంబర్ 9వ తేదీన సాధించింది. ఇంతకీ జోష్ షార్ట్ వీడియో మేకింగ్ యాప్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎందుకెక్కింది..

జోష్ షార్ట్ వీడియో యాప్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం పొందింది. భారత జాతీయ గీతంకు ప్రజలు వందనం చేసే అతిపెద్ద ఆన్‌లైన్ వీడియో క్రియేట్ చేసినందుకు గాను జోష్ షార్ట్ వీడియో యాప్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించింది. దేశం 75వ స్వాంతంత్ర్య వేడుకలు జరుపుకుంటున్న నేపథ్యంలో జోష్ యాప్ ఈ ఏడాది ఆగష్టు 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు #saluteindia క్యాంపెయిన్‌ను నిర్వహించింది. ఆ సమయంలో ఈ ఘనత సాధించి గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించింది.

Josh in Guinness Book of world records for largest online video of people saluting Nati

సమాజంలో పేరుకుపోయిన వివక్ష, బాలకార్మికులు, అవినీతి, వరకట్నంలాంటి రుగ్మతలు తొలిగిపోయేలా #saluteindia క్యాంపెయిన్ ద్వారా అవగాహన తీసుకొచ్చింది జోష్ యాప్. ప్రతి భారతీయుడు దీన్ని బాధ్యతగా భావించి సమాజంలో స్వైర విహారం చేస్తున్న ఇలాంటి భయంకర రుగ్మతలక చెక్ పెట్టేలా అవగాహన కార్యక్రమం జోష్ యాప్ ఈ క్యాంపెయిన్ ద్వారా తీసుకొచ్చింది. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఔత్సాహికులు పాల్గొని జోష్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తమ వీడియోల ద్వారా ఇంప్లిమెంట్ చేశారు. ఔత్సాహికులు తయారు చేసిన 29,529 వీడియోల్లో వారికి దేశం పట్ల ఉన్న గౌరవం, దేశభక్తి, స్పష్టంగా కనిపించింది. దీంతో అంతకుముందు ఉత్తర్ ప్రదేశ్ పర్యాటక మరియు సాంస్కృతికశాఖ, గోరఖ్‌పూర్ జిల్లా పాలనావర్గం పేరు పై ఉన్న రికార్డును బద్దలు కొట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2021న 23,529 వీడియోలను యూపీ సర్కార్ చేసింది.

Josh in Guinness Book of world records for largest online video of people saluting Nati

ఈ సరికొత్త రికార్డు జోష్ సాధించడంపై ఆ యాప్ క్రియేటర్ మరియు కంటెంట్ ఎకోసిస్టం హెడ్ సుందర్ వెంకటరామన్ తన స్పందన తెలిపారు. "జోష్ సాధించిన ఈ గొప్ప విజయంపై చాలా ఆనందంగా ఉంది.అతిపెద్ద ఆన్‌లైన్ వీడియో క్రియేట్ చేసి గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాదించడం చాలా గొప్ప విషయం. దేశంపట్ల ఉన్న గౌరవం, సమాజం పట్ల ఉన్న బాధ్యత, అవగాహన తీసుకురావడంలో మా కమిట్‌మెంట్ గురించి ఈ విజయం సాక్ష్యంగా నిలుస్తుంది. క్రియేటర్స్‌కు, యూజర్లకు,ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా కలలు సాకారం చేసినందుకు ధన్యవాదాలు" అని చెప్పారు.

నీల్ ఫాస్టర్, వైస్‌ ప్రెసిడెండ్ (EMEA APAC) గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మాట్లాడుతూ... " ప్రజలు జాతీయ గీతానికి వందనం చేస్తున్న అతిపెద్ద ఆన్‌లైన్ వీడియో క్రియేట్ చేసినందుకు గాను జోష్ యాప్‌ను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌ హోల్డర్‌గా ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ 29,529 వీడియోలు చేయడంలో సహకరించి సరికొత్త రికార్డు క్రియేట్ చేయడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ నలుమూలల నుంచి ప్రజలను డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఏకం చేయడంలో సఫలీకృతమైన జోష్ యాప్‌ యాజమాన్యాన్ని ఈ సందర్భంగా సత్కరించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాము" అని అన్నారు.

జోష్ షార్ట్ వీడియో యాప్ వ్యవస్థాపకులు వీరేంద్ర గుప్తా, సహ వ్యవస్థాపకులు ఉమాంగ్ బేడి మాట్లాడుతూ- "మా ప్లాట్‌ఫామ్ భారత్‌లో పుట్టింది, భారత్ కోసమే పుట్టింది. భారత నెటిజెన్ల మనస్తత్వాన్ని సరిగ్గా అంచనా వేయగలిగే సామర్థ్యం ఉంది. మా ప్లాట్ ఫాం-ప్రజలు-క్యాంపెయిన్‌కు కారణం ఈ మూడు కలిశాయి కాబట్టే ఇంతటి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాం. ఈ రోజు మా మనస్సంత ఎంతో సంతోషంతో నిండిపోయింది. ఎంతో గర్వంగా కూడా ఉంది. కొన్ని వేలమంది భారతీయులు తమ దేశం పట్ల ఉన్న గౌరవం, దేశభక్తిని జోష్ యాప్ వేదికగా చాటుకున్నారు. మా యాప్‌పై నిబంధనలకు అనుగుణంగా ఉండే వీడియోలు మాత్రమే అంటే సొంత కంటెంట్ కలిగిన వీడియోలు మాత్రమే పోస్ట్ అయ్యేలా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగిస్తున్నాం. మా బృందం కన్న కల ఈ విజయంతో సాకారమైందని భావిస్తున్నాం." అని చెప్పారు.

జోష్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించడంతో తమపై మరింత బాధ్యత పెరిగిందని యాజమాన్యం పేర్కొంది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది.

English summary
Josh, Indias fastest growing and most engaged short-video app, made history on 9th September, 2021 by setting a new Guinness World Records title of creating the largest online video of people saluting the Indian National Anthem.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X