జోషిమఠ్ వద్ద 30 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్

ఉత్తరాఖండ్‌లోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు ఈ వారాంతం పర్యాటకులతో పోటెత్తాయి. జోషిమఠ్, ముస్సోరీతో పాటు ప్రధాన పర్యాటక రహదారులన్నీ వాహన ప్రవాహంగా మారాయి. సుదీర్ఘ ట్రాఫిక్‌ జామ్‌లు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితులు పర్యాటకులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోన్నాయి. 45 డిగ్రీల ఎండ నుంచి ఉపశమనం పొందడానికి వేలాది మంది ప్రజలు ఇక్కడికి చేరుకోవడంతో పర్వత మార్గాలన్నీ కిక్కిరిసిపోయాయి.

జోషిమఠ్‌ వద్ద పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఇక్కడ వాహనాల రద్దీ దాదాపు 25 నుంచి 30 కిలోమీటర్ల వరకు స్తంభించిపోయింది. పర్యాటకులు గంటల తరబడి తమ వాహనాల్లో చిక్కుకుపోయారు. ఇది వారికి ఓ పీడకలగా మారింది. ముస్సోరీలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. నైనిటాల్‌లో సందర్శకుల సంఖ్య పెరగడంతో హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు దాదాపు పూర్తిగా నిండిపోయాయి.

Joshimath Traffic Jam Himalayas Turned into World s Longest into 25-30 KM Traffic Phenomenon Unfolds

దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వేలాది వాహనాలతో హిమాలయాలు ప్రపంచంలోనే అతి పొడవైన పార్కింగ్ స్థలంగా మారిందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. విష్ణుప్రయాగ్ నుండి 15 కిలోమీటర్ల అవతలి వరకు పర్యాటకులు గంటల తరబడి తమ కార్లలో చిక్కుకుపోయారని హిమాలయన్ హిందూ అనే ఎక్స్ యూజర్ ఓ వీడియోను షేర్ చేశారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి, రోహ్‌తంగ్‌లతో పాటు ఉత్తరాఖండ్‌లోని నైనితాల్, బద్రినాథ్, హేమకుండ్ సాహిబ్, ఔలి, జోషిమఠ్ వంటి ప్రదేశాల్లో ప్రస్తుతం పర్యాటకులు, యాత్రికుల రికార్డు స్థాయి రద్దీ కనిపిస్తోంది. పర్వతాలపై ఆహ్లాదకరమైన వాతావరణం, అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, మంచు కురిసిన దృశ్యాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. దీంతో ప్రజలు సుదీర్ఘ ప్రయాణాలను, గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లను భరిస్తూ పర్వత ప్రాంతాలకు వెళ్తున్నారు.

పర్యాటక స్థలాల్లో హోటళ్లు పూర్తిగా నిండిపోయాయి. పార్కింగ్‌కు స్థలం కొరత ఏర్పడుతోంది. రోడ్లపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌లు చోటు చేసుకుంటున్నాయి. మనాలి ప్రస్తుతం పర్యాటకుల భారీ ప్రవాహంతో నిండిపోయింది. ముఖ్యంగా మే నెల చివరిలో కూడా రోహ్‌తంగ్ పాస్ వద్ద మంచును చూడాలనే ఆశ ప్రజలను ఇక్కడికి రప్పిస్తోంది. సముద్ర మట్టానికి సుమారు 13,000 అడుగుల ఎత్తులో ఉన్న రోహ్‌తంగ్ పాస్ ప్రస్తుతం మంచుతో కప్పుకుపోయింది.

ఈ విపరీతమైన రద్దీ మనాలి-రోహ్‌తంగ్ రహదారిపై వాహనాల రాకపోకలను దాదాపు నిలిపివేసింది. మనాలీలో మాల్ రోడ్, భవాలి రోడ్, కాలాడుంగి రోడ్.. వంటి మార్గాల్లో రోజంతా జామ్‌ల పరిస్థితి నెలకొంటోంది. గంటల తరబడి వాహనాల్లోనే చిక్కుకుపోతున్నారు. బాబా నీమ్ కరోలి మహారాజ్‌కు చెందిన కైంచీధామ్‌లో కూడా భక్తుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది.

దేశం నుండే కాకుండా విదేశాల నుండి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడికి చేరుకుంటున్నారు. ఆలయ ప్రాంగణంలో, పరిసర ప్రాంతాల్లో భక్తుల పొడవైన క్యూలు కనిపిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో చార్‌ధామ్ యాత్ర ప్రస్తుతం పూర్తి స్థాయి రద్దీతో కొనసాగుతోంది. బద్రినాథ్ ధామ్, హేమకుండ్ సాహిబ్ యాత్రలతో పాటు పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఔలి, నీతి-మాన లోయ, ఇతర పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తున్నారు.

జోషిమఠ్ ప్రాంతం అత్యధిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మార్వాడీ నుండి గోవింద్‌ఘాట్ వరకు, జోషిమఠ్ నుండి సెలాంగ్ వరకు అనేక చోట్ల 15 నుండి 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. ఉదయం నుండి అర్ధరాత్రి వరకు రోడ్లపై వాహనాల పొడవైన క్యూలు దర్శనమిస్తున్నాయి. చమోలి జిల్లాలోని ఎత్తైన ప్రాంతాల్లో ఇంకా వర్షాలు, మంచు కురిసినప్పటికీ భక్తుల ఉత్సాహం ఏ మాత్రం తగ్గడం లేదు. బద్రినాథ్ ధామ్‌లో ఇప్పటివరకు 7.25 లక్షల మందికి పైగా భక్తులు దర్శనం చేసుకోగా, చార్‌ధామ్ యాత్రలో మొత్తం యాత్రికుల సంఖ్య 24 లక్షల మార్కును దాటింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+