బలపరీక్ష వేళ కొత్త ట్విస్ట్: ఫ్లోర్ లీడర్ గా అజిత్ కొనసాగింపు వివాదం: ప్రొటెం స్పీకర్ నిర్ణయమే ఫైనల్
ఫడ్నవీస్ తనకు సభలో మెజార్టీ నిరూపించుకోవటానికి డెడ్ లైన్ దగ్గర పడుతోంది. సుప్రీం ఆదేశాలతో బుధవారం సాయంత్రం 5 గంటలకు ఆయన సభలో బల పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంది. అయితే, బీజేపీ తమ సమర్ధతను చాటుకోవాల్సిన సమయం ఇది. ఇదే సమయంలో మరో కొత్త ట్విస్ట్. ఫడ్నవీస్ తో పాటుగా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఎన్సీపీ శాసన సభా పక్ష నేతగా వ్యవహ రిస్తున్నారు.
అదే హోదాలో ఎన్సీపీ సభ్యుల మద్దతు ఫడ్నవీస్ కు ఉందంటూ గవర్నర్ లేఖ ఇచ్చారు. అయితే, అజిత్ ను మత పార్టీ ఫ్లోర్ లీడర్ గా తప్పిస్తున్నట్లుగా ఎన్సీపీ స్పీకర్ కార్యాలయంలో లేఖ ఇచ్చింది. ఇక, బలపరీక్ష ముందు ఆయన ఫ్లోర్ లీడర్ గా తప్పిస్తూ పార్ట ఇచ్చిన లేఖను ప్రొటెం స్పీకర్ అనుమతిస్తారా..లేక పక్కన పెడతారా అనేది ఇప్పుడు కొత్త చర్చ. ఆ లేఖను స్పీకర్ పరిగణలోకి తీసుకోక పోతే..అజిత్ విప్ జారీ చేస్తారా..ఇటు ఎన్సీపీ సైతం విప్ జారీ చేస్తోంది. మరి.. ఎన్సీపీ సభ్యులు ఎవరి విప్ అనుసరించాలి. ఇదీ..బల పరీక్ష వేల..మహా రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.

ఎన్సీపీ ఫ్లోర్ లీడర్ పైన కొత్త పంచాయితీ..
అర్ద్రరాత్రి రాజకీయ నిర్నయం తో ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కాగా..ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసారు. అయితే అదే సమయంలో ఎన్సీపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న అజిత్ పవార్ తమ పార్టీ ఎమ్మెల్యేల మద్దతు బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్నట్లుగా గవర్నర్ కు లేఖ ఇచ్చారు.
ఇక, ఆ తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆయన ఇచ్చిన లేఖ చెల్లదని..అజిత్ పవార్ ను ఎన్సీపీ ఫ్లోర్ లీడర్ గా తొలిగిస్తున్నామంటూ తమ సభ్యుల ద్వారా అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి లేఖ పంపారు. అయితే, దీని పైన స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందిన స్పీకర్ పేషీ అధికారులు స్పష్టం చేసారు.

అజిత్ పవార్..జయంతి పాటిల్..
తాము అజిత్ పవార్ ను ఎన్సీపీ ఫ్లోర్ లీడర్ గా తొలిగిస్తూ జయంతి పాటిల్ తమ ఫ్లోర్ లీడర్ గా వ్యవహరిస్తారని..ఆయన పార్టీ సభ్యులకు అవసరమైన విధంగా విప్ జారీ చేస్తారని స్పీకర్ కార్యాలయానికి రాసిన లేఖ లో పేర్కొన్నారు. అయితే, ప్రొటెం స్పీకర్ దీనిని పరిశీలించి..ఆమోదిస్తే ఎన్సీపీ కి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా.. ఆ లేఖను ప్రొటెం స్పీకర్ ను పరిగణలోకి తీసుకోకుండా వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తే న్యాయ పరంగా...లాజికల్ గా కొన్ని సమస్యలు తెర మీదకు వచ్చే అవకాశం ఉంది.
స్పీకర్ ప్రకటించే వరకూ అజిత్ పవార్ ఎన్సీపీ ఫ్లోర్ లీడర్ గానే ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అయితే, వీటన్నింటినీ పరగణలోకి తీసుకొనే మరాఠా యోధులు శరద్ పవార్ ముందుగానే అజిత్ పవార్ ను పార్టీ శాసనసభా పక్ష నేత పదవి నుండి తప్పిస్తున్నట్లు ప్రకటించిన విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే, పార్టీ పరంగా ఆయన ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చని..కానీ, పార్టీ ఫ్లోర్ లీడర్ మాత్రం ఎమ్మెల్యేలు మాత్రమే ఎన్నుకోవాల్సి ఉంటుందని గుర్తు చేస్తున్నారు.

ప్రొటెం స్పీకర్ దే కీలక పాత్ర..
ఇక, సభ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్ ఈ వ్యవహారం మీద రూలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటి వరకు అజిత్ పవార్ తో పాటుగా జయంతి పాటిల్ సైతం విప్ ఇచ్చే అధికారం తమకంటే తమకు ఉందని వాదించే అవకాశం ఉంటుంది. అయితే, ఇప్పటికే సుప్రీంలో సైతం అజిత్ పవార్ తరపు న్యాయవాది తమదే అసలైన ఎన్సీపీ అంటూ వాదించారు. ఇక..దీని ద్వారా అజిత్ తాను ఇచ్చే విప్ ఉల్లంఘించిన పార్టీ ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడుతుందని హెచ్చిరకలు చేసేందుకే ఇలాంటి ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారని అంచనా వేస్తున్నారు.
దీంతో..ఇప్పుడు విప్ జారీ చేసే అధికారం పార్టీ నిర్ణయం మేరకు జయంత్ ను పార్టీ ఫ్లోర్ లీడర్ గా అజిత్ పవార్ ను స్పీకర్ తప్పిస్తే..మొత్తం సమస్యకు పరిష్కారం లభిస్తుంది. లేకుంటే..బల పరీక్ష వేళ..ఇది కొత్త సమస్యకు కారణమయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications