స్టీవ్ జాబ్స్‌లా పనిచేయాలి: కార్యకర్తలతో రాహుల్
లక్నో: కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలే పునర్నిర్మించాలని, వ్యాపార దిగ్గజం యాపిల్ సంస్థను స్టీవ్ జాబ్స్ మలచినంతగా కార్యకర్తలు పార్టీ కోసం అంకిత భావంతో పనిచేయాలని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు.
సోమవారం ఆయన ఉత్తరప్రదేశ్‌లోని మధుర దేవాలయాన్ని సందర్శించిన అనంతరం పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. సమీప భవిష్యత్తులో యూపీ అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

పార్టీ సిద్ధాంతాలే తమను నెంబర్ 1 స్థానంలో నిలబెడతాయన్నారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడంతో మోడీ ప్రభుత్వం విఫలమయ్యిందని విమర్శించారు.
అదే సమయంలో రైతు వ్యతిరేక 'భూసేకరణ సవరణ బిల్లు'ను అడ్డుకోవడంలో కాంగ్రెస్ విజయం సాధించిందని రాహుల్ చెప్పారు. ప్రధాని చేసిన కనీస వాగ్దానాలు కూడా నెరవేర్చలేకపోయారని అన్నారు.












Click it and Unblock the Notifications