వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధికారులను జైలుకి పంపినంత మాత్రాన ఆక్సిజన్ కొరతకు పరిష్కారం దొరకదు: జస్టిస్ చంద్రచూడ్

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
జస్టిస్ చంద్రచూడ్

దేశ రాజధానిలో కోవిడ్ రోగులకు మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేయకపోవడంపై దిల్లీ హైకోర్ట్ తమకు జారీ చేసిన కోర్టు ధిక్కార నోటీసులపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఆ కేసును జస్టిస్ డి.చంద్రచూడ్ ధర్మాసనం విచారించింది.

కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. దిల్లీకి 700 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసే ప్రక్రియ కొనసాగుతోందని, నిన్న కూడా 585 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేశామని ఆయన అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు.

ఆక్సిజన్ సరఫరా కోసం ఒక బలమైన వ్యవస్థ ఉండాలని, దానిని ఏర్పాటు చేసేందుకు ఏమేం చేస్తున్నారో చెప్పాలని జస్టిస్ చంద్రచూడ్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించారు.

ఆక్సిజన్

'ధిక్కారం కేసు పెట్టి అధికారులను జైళ్లలో పెట్టడం వల్ల ఆక్సిజన్ రాదు. కానీ, దానికోసం మీరు ఏమేం చేయగలరో మాకు చెప్పండి’ అని కోర్టు ఆయన్ను అడిగింది.

'ఆక్సిజన్ కొరత వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోయారనడంలో, ఇది అత్యవసర స్థితి అనడంలో ఎలాంటి వివాదం లేదని, కానీ దానికోసం ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలు రూపొందించింద’ని జస్టిస్ షా కూడా అడిగారు.

ఆక్సిజన్ కొరత కారణంగా కుటుంబసభ్యులను కోల్పోయిన బాధితులు

సమాధానంగా సొలిసిటర్ జనరల్... "మొదట 5 వేల టన్నుల ఆక్సిజన్ అందుబాటులో ఉంది. అందులో పారిశ్రామిక ఆక్సిజన్ కూడా ఉంది. మొదట్లో మెడికల్ ఆక్సిజన్‌కు అంత డిమాండ్ లేదు. దాంతో, మేం పారిశ్రామిక ఆక్సిజన్ వినియోగాన్ని ఆపేశాం. అలా చాలా మందికి సాయం అందింది. కానీ, ఇప్పుడు రాష్ట్రాలకు ఆక్సిజన్ పంపిణీ విషయంలో సమస్య వస్తోంది" అన్నారు.

దిల్లీలో 700 టన్నుల ఆక్సిజన్ సరఫరా కోసం ఈరోజు నుంచి సోమవారం వరకూ ఏమేం ఏర్పాట్లు చేస్తారో మాకు చెప్పాలని జస్టిస్ చంద్రచూడ్ ఎస్జీ తుషార్ మెహతాను అడిగారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Just sending officials to jails will not solve the oxygen problem:Justice Chandrachud
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X