Coronavirus:ఒక్క క్లిక్‌తో ఆయా దేశాల్లో ఉన్న ట్రావెల్ గైడ్‌లైన్స్, ఆంక్షల సమాచారం తెలుసుకోండి
అసలే కరోనావైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. చాలామంది ఇంకా చికిత్స పొందుతున్నారు. ఇక ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా కుప్పకూలాయి. అగ్రరాజ్యాలు సైతం ఈ మహమ్మారి విసిరిన పంజాకు బెంబేలెత్తిపోతున్నాయి. తొలినాళ్లలో ఇది పెద్ద వైరస్ కాదని వ్యాఖ్యలు చేసిన అగ్రరాజ్యాలు ఇప్పుడు ఊపిరి తీసుకోలేకున్నాయి. వారి దేశాలలో సంపూర్ణంగా లాక్‌డౌన్ ప్రకటించాయి. దీంతో రవాణా వ్యవస్థతో పాటు అన్నీ షట్‌డౌన్‌కు వచ్చాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలు వారి దేశంలోకి రావాలంటే కొన్ని గైడ్‌లైన్స్ సూచిస్తున్నాయి. దాదాపు చాలా దేశాలు ఇతర దేశాల వారికి ఎంట్రీ కల్పించడం లేదు.
ఇక కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పలు ప్రపంచ దేశాలు కొన్ని ట్రావెల్ అడ్వైజరీలను జారీ చేశాయి. దీంతో పాటు గైడ్‌లైన్స్‌ను సూచించాయి. అన్ని దేశాలకు సంబంధించిన గైడ్ లైన్స్ ట్రావెల్ అడ్వైజరీస్ వన్ ఇండియా పాఠకుల కోసం తీసుకురావడం జరిగింది. దీనికోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ ప్రపంచ దేశాలతో కూడిన మ్యాప్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ దేశానికి సంబంధించిన ట్రావెల్ అడ్వైజరీస్ గైడ్‌లైన్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో మ్యాప్‌లో ఆదేశంపై క్లిక చేయండి చాలు. వెంటనే ఆదేశానికి సంబంధించిన ట్రావెల్ అడ్వైజరీలతో పాటుగా గైడ్‌లైన్స్ కూడా కనిపిస్తాయి. వీటితో పాటుగా లైవ్ మ్యాప్, హెల్ప్ లైన్, పేషెంట్ ట్రాకర్, నష్టపోయిన జిల్లాల వివరాలు,గణాంకాలు, టెస్టింగ్ సెంటర్లు,నిత్యవసర సేవలు లాంటి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఒక్క క్లిక్‌తో మీకు కావాల్సిన సమాచారం పొందండి.