రెండేళ్ల తరువాత ప్రతిష్ఠాత్మక పోస్టు భర్తీ
Lokpal: ప్రతిష్ఠాత్మక లోక్‌పాల్ ఛైర్మన్ స్థానాన్ని కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు భర్తీ చేసింది. సభ్యులనూ ప్రకటించింది. రెండు సంవత్సరాలుగా ఈ పోస్టులన్నీ కూడా ఖాళీగా ఉంటూ వస్తోన్నాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో వీటిని కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మాణిక్‌రావ్ ఖన్విల్కర్.. లోక్‌పాల్ ఛైర్మన్‌గా నియమితులు అయ్యారు. 2022 జులైలో ఆయన పదవీ విరమణ చేశారు. అంతకుముందు మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, బోంబే హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమోట్ అయ్యారు.
శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం, హోమోసెక్సువాలిటీ, ఆధార్ వేలిడిటీ.. వంటి కీలక తీర్పులను ఇచ్చిన న్యాయమూర్తుల ధర్మాసనాల్లో ఖన్విల్కర్ కూడా ఒకరు. ఆయనను లోక్‌పాల్ ఛైర్మన్‌గా నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు కేంద్రం పంపంచిన ప్రతిపాదనలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. నోటిఫికేషన్ జారీ చేశారు.

వివిధ రాష్ట్రాల హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా పని చేసి, రిటైర్డ్ అయిన ఏడుమంది లోక్‌పాల్ సభ్యులుగా నియమితులు అయ్యారు. జస్టిస్ లింగప్ప స్వామి, జస్టిస్ సంజయ్ యాదవ్, జస్టిస్ రీతురాజ్ అవస్థి.. జ్యుడీషియల్ సభ్యులుగా అపాయింట్ అయ్యారు. కేంద్ర ఎన్నికల మాజీ ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర, పంకజ్ కుమార్, అజయ్ టిర్కే.. నాన్ జ్యుడీషియల్ సభ్యులుగా నియమితులయ్యారు.
ఛైర్మన్‌గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్పీకర్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత.. మరో ముగ్గురు సభ్యులుగా ఉండే కమిటీ.. వారిని నామినేట్ చేసింది. మొట్టమొదటి లోక్‌పాల్ ఛైర్మన్‌గా 2019లో జస్టిస్ పీసీ ఘోష్ పని చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత జస్టిస్ ప్రదీప్ కుమార్ మహంతి ఈ హోదాలో పని చేశారు. 2022లో ఆయన కాల పరిమితి ముగిసింది. అప్పటి నుంచి ఈ పోస్ట్ ఖాళీగా ఉంటో వస్తోంది.












Click it and Unblock the Notifications