సల్వాజుడుంపై తీర్పు వ్యక్తిగతం కాదు.. సుప్రీంకోర్టుది: సుదర్శన్ రెడ్డి
దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలపై ఉత్కంఠ పెరుగుతోంది. వామపక్ష తీవ్రవాదం బలపడేందుకు సల్వాజుడుంపై సుదర్శన్ రెడ్డి ఇచ్చిన తీర్పే కారణమంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డి స్పందించారు. దానిపై ఆయన స్పందిస్తూ.. ఆ తీర్పును సుప్రీంకోర్టు ఇచ్చిందని.. అది తన వ్యక్తగత నిర్ణయం కాదని వివరణ ఇచ్చారు.
అమిత్ షా ఆరోపణలు
కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ.. సల్వా జుడంపై జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇచ్చిన తీర్పును పేర్కొన్నారు. నక్సలైట్లపై పోరాటం కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం గిరిజన యువకులతో ఏర్పాటు చేసిన 'సల్వా జుడం' అనే బృందం చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అని జస్టిస్ సుదర్శన్ రెడ్డి 2011లో తీర్పు ఇచ్చారని అమిత్ షా గుర్తు చేశారు. ఆ తీర్పు ఇవ్వకుంటే, సల్వా జుడం అమల్లో ఉంటే నక్సలైట్ల ఉద్యమం 2020 నాటికే అంతమయ్యేదని ఆయన అన్నారు. నక్సలైట్లకు గట్టి మద్దతుదారుడైన సుదర్శన్ రెడ్డిని 'ఇండియా' కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసుకోవడం వెనుక వామపక్షాల ఒత్తిడి ఉందని కూడా అమిత్ షా ఆరోపించారు.

సుదర్శన్ రెడ్డి వివరణ
అమిత్ షా వ్యాఖ్యలపై సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. "తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. అది నా వ్యక్తిగత తీర్పు కాదు. చర్చలలో కొంత మర్యాద ఉండాలి. అయితే ఈ విషయంలో నేను హోం మంత్రితో చర్చించదలుచుకోలేదు" అని అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలను ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీగా చూడకుండా, రెండు సిద్ధాంతాల మధ్య పోటీగా చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల పోరు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి తమ అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను బరిలోకి దింపగా.. దానికి ప్రతిగా 'ఇండియా' కూటమి బి. సుదర్శన్ రెడ్డిని నిలబెట్టింది. నామినేషన్ల గడువు పూర్తికావడంతో ఇరువురి మధ్య ముఖాముఖి పోరు అనివార్యమైంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలు సెప్టెంబర్ 9న జరగనున్నాయి, అదే రోజు ఫలితాలు వెలువడతాయి.












Click it and Unblock the Notifications