పీఎంఎల్ఏ కొత్త ఛైర్మన్‌గా చిదంబరం అరెస్ట్‌కు దారిచూపిన జస్టిస్ సునీల్ గౌర్
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ ఆర్థికమంత్రి చిదంబరం అరెస్టుకు దారిచూపిన జస్టిస్ సునీల్ గౌర్.. అప్పిలేట్ ట్రిబ్యూనల్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్(ఏటీపీఎంఎల్ఏ) కొత్త ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా రిటైరైన సునీల్ గౌర్.. సెప్టెంబర్ 23న బాధ్యతలు తీసుకోనున్నారు.
ప్రస్తుతం ఏటీపీఎంఎల్ఏ చైర్‌పర్సన్‌గా ఉన్న జస్టిస్ మన్మోహన్ సింగ్ ఆ తర్వాతి రోజు రిటైర్ కానున్నారని ట్రిబ్యునల్ వర్గాలు మీడియాకు తెలిపాయి. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చిదంబరం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేయగా.. న్యాయమూర్తిగా ఉన్న సునీల్ గౌర్.. దాన్ని తిరస్కరించారు.

కాగా, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ గౌర్ పదవీ విరమణ పొందే రెండ్రోజుల ముందే ఈ తీర్పును వెలువరించారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరమే కీలక సూత్రధారిలా కనిపిస్తున్నారంటూ 62ఏళ్ల ఈ న్యాయమూర్తి విచారణ సందర్భంగా అభిప్రాయపడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతల విచారణ చేపట్టారు.
సునీల్ గౌర్ ప్రస్థానం..
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఏప్రిల్ 2008లో నియమించబడ్డారు. ఆ తర్వాత ఏప్రిల్ 2012లో శాశ్వత జడ్జీగా నియామకమయ్యారు. మూడు దశబ్దాలుగా పనిచేసిన ఆయన.. చాలా హై ప్రొఫైల్ కేసులను విజయవంతంగా పూర్తి చేశారు. అవినీతి కేసులు, మంసం ఎగుమతిదారుడు మొయిన్ ఖురేషిపై ఉన్న మనీలాండరింగ్ కేసును ఆయనే విచారించారు.
ప్రభుత్వం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) కేసును కూడా ఆయన విచారించారు. హైకోర్టు న్యాయమూర్తిగా రాకముందు సివిల్ అండ్ క్రిమినల్ కేసులు, ఢిల్లీ హైయ్యర్ జూడీషియల్ సర్వీస్, సంచలనంగా మారిన శివానీ భట్నాగర్ హత్య కేసు విచారణను కూడా ఆయన చేశారు.ఢిల్లీ మీడియేషన్ సెంటర్, తిస్ హజారీ కోర్టు, కర్కరర్డూమా కోర్టుల్లో ఇంఛార్జీ న్యాయమూర్తిగా పనిచేశారు.












Click it and Unblock the Notifications