పాక్ ఏజెంట్లతో లింకులు: జ్యోతి మల్హోత్రాపై 2500 పేజీల ఛార్జిషీట్ సంచలనం!

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసిన ఆరోపణలపై అరెస్టయిన జ్యోతి మల్హోత్రాపై ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) 2500 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేసింది. పోలీసులు ఛార్జిషీట్‌లో ఆమె పాకిస్థాన్ ఏజెంట్లకు సమాచారాన్ని లీక్ చేసిందని పేర్కొన్నారు. హర్యానా పోలీసుల నివేదిక ప్రకారం.. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ కోసం ఒక టూల్ కిట్‌గా ఉపయోగించబడిందని, నిరంతరం పాకిస్తానీ ఏజెంట్లతో సంప్రదింపులు జరుపుతూ సమాచారాన్ని పంచుకుందని సిట్ పేర్కొంది. పాకిస్తాన్‌లో పర్యటించిన సమయంలో ఆమె అక్కడి ఏజెంట్లతో పరిచయం పెంచుకుందని పోలీసులు వెల్లడించారు. ఆమె మొబైల్ ఫోన్ నుంచి అనేక ముఖ్యమైన సమాచారం పోలీసులకు లభ్యమైంది.

ఛార్జిషీట్‌లో జ్యోతి పాక్ హై కమిషన్‌లో ఉన్న దానిష్ అలీతో నిరంతరం సంప్రదింపుల్లో ఉందని కూడా పేర్కొన్నారు. పోలీసులు వారి మధ్య జరిగిన చాట్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు జ్యోతికి ఐఎస్‌ఐ ఏజెంట్లు అయిన షకీర్, హసన్ అలీ మరియు నాసిర్ ధిల్లాన్‌లతో కూడా సంబంధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. హసన్ అనే ఏజెంట్‌తో ఆమె చేసిన చాట్‌లు కూడా పోలీసులకు లభ్యమయ్యాయి. కేసు డైరీలో జ్యోతి విదేశీ ప్రయాణాల వివరాలు కూడా చేర్చబడ్డాయి.

Jyoti Malhotra Spy Case Explosive 2500-Page Chargesheet Reveals ISI Links

ఛార్జిషీట్‌లో పేర్కొన్న ముఖ్య విషయాలు

గూఢచర్యం: జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ కోసం చాలా కాలం నుంచి గూఢచర్యం చేస్తోందని సిట్ ఆరోపించింది.

పాకిస్తానీ ఏజెంట్లతో సంబంధాలు: ఆమె పాకిస్తానీ గూఢచార సంస్థల ఏజెంట్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు.

సాక్ష్యాలు: జ్యోతి మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ నుంచి సేకరించిన డేటా, కాల్ రికార్డింగ్‌లు, ఆమె పాకిస్తాన్ పర్యటన వివరాలను ఈ కేసులో ప్రధాన సాక్ష్యాలుగా చూపారు.

పాక్ ఏజెంట్ల పేర్లు: పాకిస్తాన్ హై కమిషన్‌లో ఉన్న ఎహసాన్-ఉర్-రహీమ్ అలియాస్ దానిష్ అలీతో జ్యోతి సుదీర్ఘంగా సంభాషించినట్లు ఛార్జిషీట్‌లో వెల్లడించారు. అంతేకాకుండా, షకీర్, హసన్ అలీ, నాసిర్ ధిల్లాన్ వంటి పాకిస్తానీ ఏజెంట్లతో కూడా ఆమె మాట్లాడినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి.

జ్యోతి మల్హోత్రా అరెస్ట్, కేసు వివరాలు
జ్యోతి మల్హోత్రాను హర్యానా పోలీసులు మే 16న గూఢచర్యం ఆరోపణలపై అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆమె జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఆమెపై బీఎన్ఎస్ సెక్షన్ 152, అధికారిక రహస్యాల చట్టం 1923లోని సెక్షన్లు 3,4, 5 కింద కేసులు నమోదు చేశారు. ఆగస్టు 4న ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో ప్రవేశపెట్టగా.. ఆమె కస్టడీని మరో 14 రోజులు పొడిగించారు. ఇప్పుడు ఆగస్టు 18న ఆమెను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఛార్జిషీట్ తర్వాత ఆమె బెయిల్ పిటిషన్ హైకోర్టులో ఇదివరకే తిరస్కరించబడింది. ఈ కేసులో పోలీసులు పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను కూడా విచారించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+