వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్ముకాశ్మీర్ డిజిపిగా నిజామాబాద్ జిల్లా తెలుగుతేజం

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Rajendra Kumar new DGP of J&K
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్ డిజిపి(డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్)గా తెలుగుతేజం కె రాజేంద్ర కుమార్ ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన అశోక్ ప్రసాద్ స్థానంలో తెలంగాణకు చెందిన రాజేంద్ర కుమార్ కశ్మీర్ పోలీస్ బాస్‌గా నియమితులయ్యారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన రాజేంద్ర కుమార్ 1984 బ్యాచ్ ఐపీఎస్ అధికారి.

అత్యంత సమర్థుడైన పోలీస్ అధికారిగా పేరు తెచ్చుకున్నారు. 2001లో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ భవనంపై దాడిని ఎదుర్కొన్నారు. 2002లో అప్పటి జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై ఉగ్రవాదులు జరిపిన హత్యాయత్నాన్ని తిప్పికొట్టారు.

ఎమ్మెల్యేల అపహరణ ప్రయత్నాన్ని విఫలం చేశారు. 2006లో రాజేంద్ర కుమార్‌పై ఉగ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆయన శరీరంలోకి మూడు బుల్లెట్లు దిగినా వెనక్కి తగ్గకుండా ఉగ్రవాదులను తరిమికొట్టారు. ఇలా ప్రతి సందర్భంలోనూ రాజేంద్ర కుమార్ దేశవ్యాప్తంగా వార్తల్లోకి వచ్చారు. ప్రజల మనన్నలు అందుకున్నారు.

ఆయనకు రాష్ట్రపతి పోలీస్ మెడల్, శౌర్య పతకం, షేర్-ఏ-కశ్మీర్ శౌర్య పతకం, షేర్-ఏ-కశ్మీర్ ప్రతిభా సేవల పతకం వంటి పురస్కారాలు పొందారు. కొత్త డిజిపి ఎంపికపై ఎన్ని ఒత్తిళ్లు వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాత్రం రాజేంద్ర కుమార్‌నే ఎంపిక చేశారు. దీనిపై బుధవారం రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర లభించడం, అధికారిక ఉత్తర్వులు వెలువడటం చకచకా జరిగిపోయింది.

English summary
The Jammu and Kashmir government on Wednesday appointed K. Rajendra Kumar as the new director general of police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X