వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమిత్ షాతో కేఏ పాల్ భేటీ, దాడి గురించి డిస్కష్, మోడీని కూడా కలుస్తాడట..?

|
Google Oneindia TeluguNews

కేఏ పాల్ ఇటీవల వరసగా వార్తల్లో నిలుస్తున్నారు. సిరిసిల్ల వెళుతుండగా అడ్డుకోవడంతో రగడ మొదలైంది. తర్వాత చంద్రబాబు, పవన్, జగన్‌ను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. పాల్ నిన్న హుటహుటిన ఢిల్లీ వెళ్లారు. ఏకంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. అమిత్ షాతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల తనపై జరిగిన దాడి గురించి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.

రాజకీయ పరిణామాలా..?

రాజకీయ పరిణామాలా..?


అమిత్ షాతో పాల్ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాల గురించి డిష్కస్ చేసినట్టు సమాచారం. సిద్దిపేలో జరిగిన దాడిలో సీఎం కేసీఆర్, కేటీఆర్ హస్తం ఉందని పాల్ ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అమిత్ షా హామీ ఇచ్చారని కేఏ పాల్ తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న అవినీతి అక్రమాలు గురించి మాట్లాడారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో రూ.లక్షల కోట్లు అవినీతి జరిగిందని కేఏ పాల్ ఆరోపించారు. అప్పుల్లో కూడా తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని చెప్పారు.

ఏపీ 8 లక్షల కోట్లు, తెలంగాణ 4 లక్షల కోట్లు

ఏపీ 8 లక్షల కోట్లు, తెలంగాణ 4 లక్షల కోట్లు

ఏపీ అప్పు 8 లక్షల కోట్లుంటే.. తెలంగాణ అప్పు 4 లక్షల కోట్లు ఉందని కేఏ పాల్ ఆరోపించారు. ఇలాగే అప్పులు చేసుకుంటూ పోతే దేశం మరో శ్రీలంకలా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని అమిత్ షాతో చెప్పానని కేఏ పాల్ వివరించారు. ప్రధాని మోడీని కలవాలని అమిత్ షా తనకు సూచించారని కేఏ పాల్ తెలిపారు. తెలంగాణ డీజీపీని కలిసేందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని చెప్పారు. అమిత్ షా అడిగిన వెంటనే కలిసేందుకు రమ్మన్నారని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రజాశాంతి పార్టీ ఒంటరిగానే పోటీ చేయబోతుందని కేఏ పాల్ పేర్కొన్నారు.

పాల్‌పై దాడి..

పాల్‌పై దాడి..

కేఏ పాల్‌పై ఇటీవల సిద్దిపేటలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. సిద్ధిపేట జిల్లా జక్కపూర్ గ్రామంలో ఆయన చెంపచెల్ అనిపించాడు. అతను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అని తెలుస్తోంది. కేఏ పాల్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగళ్ల పల్లి మండలం బస్వాపూర్‌లో అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వెళుతున్నారు. పోలీసులు జక్కాపూర్ వద్ద అడ్డుకున్నారు. మాట్లాడుతుండగా అక్కడే ఉన్న ఓ యువకుడు దాడి చేశాడు. కేఏ పాల్‌ను చెంప మీద కొట్టాడు. హఠాత్ పరిణామంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాడి చేసిన యువకుడితో కేఏ పాల్ అనుచరులు గొడవకు దిగారు. తనపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. తర్వాత డీజీపీని కలిసే ప్రయత్నం చేయడం.. హౌస్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీ అయ్యారు.

English summary
ka paul is busy in delhi. yesterday meet central home minister amith shah. complaint to for recent attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X