దేశానికి సత్యార్థి 'నోబెల్': పక్కన కూర్చునే అర్హత లేదని అమితాబ్
న్యూఢిల్లీ: తాను అందుకున్న ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతిని దేశానికి అంకితం ఇవ్వాలని కైలాష్ సత్యార్థి నిర్ణయించుకున్నారు. సత్యార్థి బుధవారం నాడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి తన నోబెల్ బహుమతిని ఆయనకు ఇవ్వడం ద్వారా దేశానికి అంకితం ఇవ్వనున్నారు.
రాష్ట్రపతి భవన్‌లో ఉంటున్న రాష్ట్రపతి ప్రణబ్‌ను ఈ రోజు సత్యార్థి కలుస్తారు. ఎనిమిది కేరట్ల గ్రీన్ గోల్డ్ ప్లేటెడ్, 24 కేరట్ గోల్డ్‌తో ఉన్న 175 గ్రాముల నోబెల్ బహుమతిని రాష్ట్రపతికి అందచేయనున్నారు. దీనిని దేశానికి అంకితం చేస్తానని సత్యార్థి చెప్పారు.

సత్యార్థి పాకిస్తాన్‌కు చెందిన సాహస బాలిక మలాలా యూసఫ్‌జాయ్‌తో కలిపి నోబెల్ బహుమతిని డిసెంబర్ 10వ తేదీన తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మంగళవారం నాడు సత్యార్థిని కలిశారు.
ముంబైలో నిర్వహించిన బ్యాంకర్ల సమావేశానికి ముఖ్య అతిథిలుగా సత్యార్థి, అమితాబ్ వచ్చారు. ఈ సందర్భంగా వారు కలుసుకున్నారు. అమితాబ్ మాట్లాడుతూ.. కైలాష్ సత్యార్థి వంటి గొప్ప వ్యక్తితో వేదిక పంచుకోవడం తనకు ఎంతో గర్వంగా ఉందని, ఆయనలాంటి వ్యక్తి పక్కన కూర్చునేందుకు తనకు అర్హత లేదన్నారు. సత్యార్థి చైల్డ్ లేబర్‌కు వ్యతిరేకంగా సేవలు అందిస్తుండటాన్ని అమితాబ్ ప్రశంసించారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications