కళాభవన్ మణి హత్యలోనూ: హీరో దిలీప్‌పై సంచలనం

కేరళలో సంచలనం సృష్టించిన నటుడు దిలీప్ కుమార్ వ్యవహారం అనూహ్య మలుపులు తిరుగుతోంది. దక్షిణాది నటి పైన ఫిబ్రవరి 17వ తేదీన జరిగిన దౌర్జన్యం, అఘాయిత్యం, అసభ్య ప్రవర్తన కేసులో దిలీప్ అరెస్టయ్యాడు.

తిరువనంతపురం: కేరళలో సంచలనం సృష్టించిన నటుడు దిలీప్ కుమార్ వ్యవహారం అనూహ్య మలుపులు తిరుగుతోంది. దక్షిణాది నటి పైన ఫిబ్రవరి 17వ తేదీన జరిగిన దౌర్జన్యం, అఘాయిత్యం, అసభ్య ప్రవర్తన కేసులో దిలీప్ అరెస్టయ్యాడు.

దిలీప్ పైన సంచలన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, ప్రముఖ నటుడు కళాభవన్ మణి మృతి కేసుతోను సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు కళాభవన్ మణి సోదరుడు సంచలన ఆరోపణలు చేశారు.

కళాభవన్ మణి హత్య కేసులో హస్తం అంటూ..

కళాభవన్ మణి హత్య కేసులో హస్తం అంటూ..

దిలీప్‌కి కళాభవన్ మణి మృతి కేసులో హస్తం ఉందని సోదరుడు రామకృష్ణన్‌, దర్శకుడు బైజు కొట్టారక్కర ఆరోపించారు. ఈ విషయానికి సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని సిబిఐకి చెప్పారని తెలుస్తోంది.

భూముల విషయంలో గొడవ

భూముల విషయంలో గొడవ

దీని గురించి కోజికోడ్‌కి చెందిన ఓ మహిళ తనకు ఫోన్‌ చేసి చెప్పిందని భూముల విషయంలో కళాభవన్ మణికి, దిలీప్‌కి గొడవ జరిగిందని బైజు సీబీఐకి వివరించారు. ఈ కేసు విషయంలోనూ దిలీప్‌ను విచారించాల్సిందిగా కోరారు.

విచారణకు సహకరించలేదని..

విచారణకు సహకరించలేదని..

కళాభవన్ మణి 2016లో చనిపోయాడు. మణి సోదరుడి ఫిర్యాదు మేరకు దర్యాఫ్తు అధికారులు దిలీప్‌ను కూడా విచారించారని తెలుస్తోంది. ఆ తర్వాత దిలీప్ విచారణకు సహకరించలేదని కళాభవన్ మణి సోదరుడు ఆరోపించారు. కుటుంబం నుంచి డిమాండ్, ఆరోపణల నేపథ్యంలో మే 2017లో సిబిఐ ఈ మృతి కేసులో విచారణ ప్రారంభించింది. విచారణ అనంతరం అతని మృతి అసహజ మరణంగా కేసు బుక్ చేశారు.

హీరోయిన్ విషయంలో ఇదీ విషయం..

హీరోయిన్ విషయంలో ఇదీ విషయం..

ఇదిలా ఉండగా, దక్షిణాది హీరోయిన్ పైన మనుషులను పెట్టి అత్యాచారం చేయించేంత కక్షను హీరో దిలీప్ ఎందుకు పెంచుకున్నాడు? దిలీప్ ను కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసు అధికారులు, ఈ విషయాన్ని బహిర్గతం చేశారు.

ఆ కక్షతో

ఆ కక్షతో

రిమాండ్ రిపోర్టులో వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం దిలీప్ భార్య అయిన కావ్యా మాధవన్, సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలో దిలీప్ ఆమెతో రహస్యంగా ప్రేమాయణాన్ని నడిపారు. అప్పుడు దిలీప్ భార్యగా ఉన్న మంజు వారియర్‌కు (తదుపరి విడాకులు ఇచ్చాడు) భావనే ఈ విషయాన్ని చేరవేసిందన్న కక్షతో దిలీప్ ఆగ్రహంతో ఊగిపోయాడు.

వీడియోలు తీయమని చెప్పి..

వీడియోలు తీయమని చెప్పి..

2013లోనే ఆమెను అవమానించాలని ప్లాన్ వేశాడు. పల్సర్ సునీతో చర్చలు జరిపాడు. ఆమెపై అత్యాచారం చేస్తున్న సమయంలో వీడియో తీయాలని, ఫోటోలు క్లారిటీతో ఉండాలని, అందుకు రూ. 1.5 కోట్లు ఇస్తానని చెప్పాడు.

కావ్యా మాధవన్‌కు ఇచ్చేందుకు..

కావ్యా మాధవన్‌కు ఇచ్చేందుకు..

ఇక ఈ వీడియోలు కావ్యా మాధవన్‌కు ఇచ్చేందుకు పల్సర్ సునీ లేదా విఘ్నేష్ లు వెళ్లారా? లేదా? అన్న విషయాన్ని విచారిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. కుట్ర మొత్తానికి దిలీప్ సూత్రధారి అయితే, మిగతా నిందితులు పాత్రధారులని తెలిపాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+