జైట్లీతో కల్వకుంట్ల కవిత భేటీ: రక్షణ పరిశ్రమలకు వినతి

తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా కల్పించాలని కేంద్రమంత్రిని కోరినట్లు చెప్పారు. ఐదేళ్లలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజక వర్గాల్ని అన్నీ రకాలుగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని కవిత చెప్పారు. మెదక్ జిల్లాలో ఎద్దుమైలారం దగ్గర ఉన్నటువంటి బీడీఎల్ యూనిట్‌ను 1987 నుంచి ఇప్పటి వరకు విస్తరించలేదని, దీనిపై కేంద్రం దృష్టి పెట్టాల్సిందిగా కేంద్రమంత్రిని కోరినట్లు కవిత తెలిపారు.
దానివల్ల మెదక్ జిల్లాలో, అదే విధంగా నిజామాబాద్ జిల్లాలో యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుందని, ఆ రెండు జిల్లాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.
రైల్వే మంత్రి సదానంద గౌడతో కూడా ఆమె భేటీ అయ్యారు. తెలంగాణలో 60 ఏళ్లుగా పెండింగులో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆమె కోరారు. నిజామాబాద్ - పెద్దపల్లి, బోధన్ - బీదర్ లైన్లకు ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని మంత్రిని కోరినట్లు ఆమె తెలిపారు. దీనిపై మంత్రి సానుకూలంగా ప్రతిస్పందించినట్లు ఆమె తెలిపారు.












Click it and Unblock the Notifications