తమిళనాడు ప్రభుత్వం అవినీతికి ఇదే సాక్షం, ఇది ప్రారంభం, కేసు పెడుతారా: కమల్ హాసన్ !
తమిళనాడు ప్రభుత్వం అవినీతికి ఈ వీడియో సాక్షంఇది ప్రారంభం మాత్రమే, ఇంకా ఉంది, కేసు పెడుతారా !రూ. 60 కోట్ల ప్రజల ఆస్తి లూటీ చేసినట్లేనా ? హీరో కమల్ హాసన్ సూటి ప్రశ్న !
చెన్నై: తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ మీద బహుబాష నటుడు, దర్శకుడు కమల్ హాసన్ మరో సారి ఆరోపణలు గుప్పించారు. తమిళనాడు ప్రభుత్వం అవినీతికి ఇదే సాక్షం అంటూ కమల్ హాసన్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు. ఇది అరంభం మాత్రమే, ఇంకా ఉంది అంటూ కమల్ హాసన్ ట్వీట్ చేశారు.
హీరో కమల్ హాసన్ సోషల్ మీడియాలో తన ఫ్రోఫైల్ ఫోటోను మార్చివేశారు. తమిళనాడులో విప్లవ మహాకవిగా గుర్తింపు తెచ్చుకున్న భారతీ లాగే అచ్చం తయారైన కమల్ హాసన్ ఆ చిత్రాన్ని తన ఫ్రోఫైల్ ఫోటోగా పెట్టుకున్నారు. ఈ సందర్బంగా తమిళనాడు ప్రభుత్వం మీద కమల్ హాసన్ మరోసారి ఆరోపణలు చేశారు.

గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ లో జరిగిన అవినీతి ఇదే అంటూ స్వచ్చంద సంస్థ అరప్పూర్ సేకరించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. తమిళనాడు ప్రభుత్వం అవినీతికి ఇంతకంటే ఇంకా ఏం సాక్షం కావాలి, ఇది ప్రారంభం మాత్రమే, ఇంకా ఉంది, థ్యాక్స్ ఆరప్పూర్ బ్రదర్స్ అంటూ కమల్ హాసన్ ట్వీట్ చేశారు.
అమ్మ జయలలిత పాలన ప్రజలకు అందిస్తాం అంటూ తమిళనాడు ప్రభుత్వం చెబుతోందని, అంటే ప్రజలకు చెందిన రూ. 60 కోట్లు మీరు లూటీ చేసినట్లేనా అని కమల్ హాసన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆరోపణలు చేసినందుకు నా మీద కేసు పెడుతారా, పెట్టుకోండి, చెన్నైలోని తేయాన్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తోంది, నేను ఎక్కడికి పారిపోను అంటూ కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. జయలలిత రూ. 60 కోట్ల అక్రమాస్తుల కేసును ఇదే సమయంలో కమల్ హాసన్ ప్రస్తావించారు.












Click it and Unblock the Notifications