వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నో పొలిటిక్స్: బకెట్ పట్టిన కమల్ హాసన్ (ఫొటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

తమిళనాడు: తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు జరుగుతున్న ప్రచారానికి ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ తెర దించారు. తాను రాజకీయాల్లోకి అడుగు పెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు. తాను రాజకీయాలే కావాలనుకుంటే ఎప్పుడో శాసనసభ్యుడినో, పార్లమెంటు సభ్యుడినో అయి ఉండేవాడినని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలకు సేవ చేయడం తనకు ఇష్టమేనని ఆయన అన్నారు.

ప్రజా సేవను రాజకీయాలతో కాకుండా సినిమాల ద్వారా చేస్తానని ఆయన చెప్పారు. చెన్నైలో ఆయన శుక్రవారం తన 60వ జున్మదిన వేడుకలను జరుపుకున్నారు. నాలుగేళ్ల వయస్సులోనే సినిమాల్లోకి అడుగు పెట్టిన కమల్ హాసన్ వైవిధ్యభరితమైన పాత్రలు పోషించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు.

తమిళంలోనే కాకుండా తెలుగు సినిమాల్లో కూడా ఆయన విశేషంగా నటించారు. ఆయనకు తెలుగులో విశేషమైన అభిమానులు ఉన్నారు. ఆయన పాత్రల పోషణ విభిన్నంగా ఉంటుంది. పాత్రల్లో జీవించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యగా భావిస్తారు.

ఇదిలావుంటే, ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఆయన శుక్రవారంనాడు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. క్లీన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆయన శుక్రవారంనాడు మధంబాకం సరస్సును శుభ్రం చేశారు. నర్పానీ ఇయాక్కం (సంక్షేమ క్లబ్) సేవకుల ద్వారా ఆయన ఈ కార్యక్రమం చేట్టారు.

బకెట్ పట్టిన కమల్ హాసన్

బకెట్ పట్టిన కమల్ హాసన్

ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు తన 60వ జన్మదినం సందర్బంగా ప్రముఖ సినీ నటుడు ఇలా బకెట్ పట్టి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అవ్వతో కమల్ హాసన్

అవ్వతో కమల్ హాసన్

తన జన్మదినం సందర్భంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టిన ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ అవ్వతో ఇలా కనిపించారు.

అవ్వకు కౌగిలింత

అవ్వకు కౌగిలింత

తన జన్మదిన వేడుకల సందర్భంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టి కమల్ హాసన్ అవ్వను తన కౌగిలిలో బంధించారు.

ఇలా అభిమానుల సత్కారం

ఇలా అభిమానుల సత్కారం

ప్రముఖ సినీనటుడు కమల్ హాసన్‌ను అభిమానులు భారీ పూలదండను మెడలో వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఇలా అభివాదం..

ఇలా అభివాదం..

నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టిన కమల్ హాసన్ ఇలా అభిమానుల మధ్య కనిపించారు.

ఉదయం పూట కమల్ హాసన్ మధంబాకం సరస్సును శుభ్రం చేసే పనిలో పాల్గొన్నారని, స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకుపోతాననే విషయంపై సాయంత్రం ప్రకటన చేస్తారని ఓ ప్రకటన తెలిపింది. రాజకీయ ఉద్దేశంతో తాను ఈ కార్యక్రమం చేపట్టలేదని కమల్ హాసన్ స్పష్టం చేశారు.

English summary
Actor-filmmaker Kamal Haasan, who turned 60 on Friday, has launched the cleaning of Madhambakkam lake as part of the Clean India campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X