వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాతీయ పౌర పట్టిక ఇప్పుడే ఎందుకు, ఎన్ఆర్సీతో లింక్? మెగా ర్యాలీలో మధ్యప్రదేశ్ సీఎం విసుర్లు

|
Google Oneindia TeluguNews

పౌరసత్వ సవరణ చట్టంపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంటోంది. సీఏఏ, ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తూ మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహించింది. సీఎం కమల్‌నాథ్ నేతృత్వంలో జరిగిన ర్యాలీలో మంత్రులు, కాంగ్రెస్ నేతలు, శ్రేణులు, సీపీఐ, బీఎస్పీ, ఎన్సీపీ నేతలు కూడా పాల్గొన్నారు.

 కాంగ్రెస్ ర్యాలీ

కాంగ్రెస్ ర్యాలీ

సీఏఏ, ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తూ బుధవారం భోపాల్‌లో కమల్ నాథ్ ‘సంవిధాన్ బచావో న్యాయ్ శాంతి యాత్ర' రంగ్‌మహల్ నుంచి పాత విధానసభ భవన సముదాయంలోకి మింటో హాల్ వద్ద గల గాంధీ విగ్రహాం వరకు నిర్వహించారు. సీఏఏ, ఎన్ఆర్సీతో కేంద్ర ప్రభుత్వ వైఖరి అర్థమైందని నిప్పులు చెరిగారు. జాతీయ పౌర పట్టిక (ఎన్పీఆర్) జాబితా రూపొందించేందుకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. కానీ ఎన్‌పీఆర్‌కు ఎన్ఆర్సీతో ముడిపెడతారనే భయం పట్టుకుందని చెప్పారు.

ఇప్పుడే ఎందుకు?

ఇప్పుడే ఎందుకు?

దేశవ్యాప్తంగా సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఎన్ఆర్సీని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. మంగళవారం ఆకస్మాత్ముగా ఎన్‌పీఆర్ కూడా చేపడుతామని చెప్పడంలో ఆంతర్యం ఏంటి అని ప్రశ్నించారు. జాతీయ పౌరసత్వ రిజిష్టర్‌తో ఎన్‌పీఆర్‌కు లింక్ పెట్టే ఉద్దేశం ఉందని కమల్‌నాథ్ ఆరోపించారు.

ఇదీ విషయం..

ఇదీ విషయం..

ఎన్ఆర్సీతో పాటు ఎన్‌పీఆర్ తీసుకురావడంతో మోడీ ప్రభుత్వ వైఖరి ఏంటో స్పష్టమైందని కమల్‌నాథ్ అన్నారు. ఇప్పటికే పార్లమెంట్‌తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జాతీయ పౌరసత్వ రిజిష్టర్‌ కూడా దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పిన విషయాన్ని కమల్‌నాథ్ గుర్తుచేశారు. కానీ తన 40 ఏళ్లు చట్టసభ (పార్లమెంట్)లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు.

రాజ్యాంగ వ్యతిరేకం

రాజ్యాంగ వ్యతిరేకం

సీఏఏ, ఎన్ఆర్సీ అనేవి రాజ్యాంగ వ్యతిరేక చట్టాలు అని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం నిబంధనలను సవరించి చట్టాలు రూపొందించాయని ఆరోపించారు. చట్టం చేసేందుకు తప్పుడు విధానాలను అవలంభించారని ఫైరయ్యారు. కమల‌నాథ్ ఇదివరకు చిందార్వా నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.

పక్కదారి పట్టించేందుకు..

పక్కదారి పట్టించేందుకు..

అంతేకాదు ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం, రైతుల సమస్యలు, పెట్టుబడులు తీసుకురావడంలో సవాళ్లు ఎదుర్కొంటున్న మోడీ ప్రభుత్వం దృష్టి మళ్లించేందుకు ఈ విధంగా చేస్తుందని కమల్ నాథ్ ఆరోపించారు. అందుకే తెరపైకి సీఏఏ, ఎన్ఆర్సీ తీసుకొచ్చి ఉంటారని విమర్శించారు.

English summary
Madhya Pradesh Chief Minister Kamal Nath on Wednesday said his party Congress also wanted to implement the National Population Register (NPR), but without the NRC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X