వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధ్యప్రదేశ్ ఎల్పీ పదవీకి కమల్ నాథ్ రాజీనామా.. సోనియా ఆమోదం

|
Google Oneindia TeluguNews

మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న కమల్ నాథ్ ఆ పదవీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీకి ఇదివరకే తెలియజేశారట. ఆమోదిస్తూ సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారని పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ తెలిపారు. శాసన సభా పక్ష నేతగా కమల్ నాథ్ రాజీనామా నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని వేణుగోపాల్ తెలిపారు. ఆయన స్థానంలో డా.గోవింద్ సింగ్ సీఎల్పీ నేతగా కొనసాగుతారని పార్టీ స్పష్టం చేసింది.

ఇంతకాలం సీఎల్పీ నేతగా కమల్ నాథ్ చేసిన సేవలకుగాను కాంగ్రెస్ అధిష్టానం అభినందనలు తెలిపింది. కమల్ నాథ్ మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. 2018లో ముఖ్యమంత్రి పదవీ కూడా చేపట్టారు. 2020లో జరిగిన పరిణామాల వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవాల్సి వచ్చింది. అప్పటినుంచి సీఎల్పీ నేతగా కొనసాగుతున్నారు. కానీ 2 నెలల క్రితం పదవీకి రాజీనామా చేస్తానని సోనియా గాంధీకి తెలియజేశారట.. ఇవాళ రాజీనామా చేయగా.. ఆమె ఆమోదం తెలిపారు.

Kamal Nath quits as Congress Legislature Party leader in Madhya Pradesh

2020లో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో కమల్ నాథ్ తన సీఎం పదవీని కోల్పోవాల్సి వచ్చింది. తర్వాత సీఎల్పీ నేతగా కంటిన్యూ అవుతున్నారు. అయినప్పటికీ ఇవాళ రాజీనామా చేశారు. ఇటీవల హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ మార్చివేసింది. పంజాబ్‌కు కూడా కొత్త పీసీసీ చీఫ్‌ను ఎంపిక చేశారు.

English summary
Congress leader Kamal Nath on Thursday resigned as the Leader of Opposition in Madhya Pradesh Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X