శశికళ ఎఫెక్ట్!: రాజకీయ కక్ష.. కమల్ హాసన్ ఆగ్రహం
తన అభిమానులను అరెస్టు చేయడంపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత నెల మెరీనా బీచ్‌లో నిర్వహించిన జల్లికట్టు ఆందోళనకు సంబంధం ఉందని సుధాగర్ అనే వ్యక్తిని, కమల్ హాసన్ రసిగరల్
చెన్నై: తన అభిమానులను అరెస్టు చేయడంపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత నెల మెరీనా బీచ్‌లో నిర్వహించిన జల్లికట్టు ఆందోళనకు సంబంధం ఉందని సుధాగర్ అనే వ్యక్తిని, కమల్ హాసన్ రసిగరల్ నర్పని ఇయక్కం సంఘానికి చెందిన కొంతమంది సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ విషయం తెలిసిన కమల్ హాసన్ బుధవారం సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇక నేను ట్వీట్లు తగ్గించి, మౌనంగా ఉండాలనుకుంటున్నానని, ప్రజల న్యాయం దేశాన్ని కాపాడుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.

నిన్న సుధాగర్‌ని, ఇయక్కం ఆర్గనైజేషన్‌కు చెందిన కొంతమందిని జల్లికట్టు ఆందోళనకారులుగా పోలీసులు అరెస్టు చేశారని, దీనివల్ల తమ ప్రతిష్ఠ పెరుగుతుందని, తమ పైన రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారన్న విషయం బయటపడుతుందన్నారు.
ఇప్పుడు మా ఇయక్కం సభ్యులు ఇంకా సహనం, హుందాతనంతో ఉండాలని కూడా కమల్ హాసన్ పేర్కొన్నారు.
మీ అభిప్రాయాలు వినిపించడాన్ని కొనసాగించండని, కానీ ఎక్కడా హద్దులు దాటకుండా చూసుకోవాలని, మన సిద్ధాంతాలను వదులుకోవాల్సిన పని లేదని, ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరచినా ప్రజల సంక్షేమం కోసం పోరాడటమే మన పని అని, ప్రతిఫలం లేని ఈ బాధ్యతనూ ఎప్పటికీ కొనసాగిస్తామని, పాలకులు వస్తారు.. పోతారు కానీ దేశం శాశ్వతంగా ఉంటుందని కమల్ పేర్కొన్నారు.
కాగా, శశికళను, ఆ తర్వాత ఆమె సూచించిన పళని స్వామి అభ్యర్థిత్వాన్ని, అదే విధంగా శనివారం నాడు జరిగిన ముఖ్యమంత్రి పళనిస్వామి బలపరీక్ష పైన కమల్ హాసన్ స్పందించారు. ఆయన వ్యాఖ్యలు శశికళకు వ్యతిరేకంగా ఉన్నాయి.












Click it and Unblock the Notifications