కమల్ హాసన్, కేజ్రీవాల్ భేటీ: మీడియాకు అసలు విషయం చెప్పిన హీరో, సీఎం, అభిమాని !

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తాను అవినీతిపై పోరాటం చెయ్యడానికి నిర్ణయించామని, మతతత్వ పార్టీలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం .

చెన్నై: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తాను అవినీతిపై పోరాటం చెయ్యడానికి నిర్ణయించామని, మతతత్వ పార్టీలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నిస్తామని బహుబాష నటుడు, నిర్మాత, దర్శకుడు కమల్ హాసన్ అన్నారు.

గురువారం చెన్నైలోని కమల్ హాసన్ ఇంటికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెళ్లిన విషయం తెలిసిందే. కమల్ హాసన్, కేజ్రీవాల్ ఏకాంతంగా అనేక విషయాలపై చర్చించారు. చర్చల అనంతరం కమల్ హాసన్, కేజ్రీవాల్ కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

 Kamal should enter in to active politics Delhi CM Aravind Kejriwal.

కేజ్రీవాల్ తో భేటీ కావడం చాల సంతోషంగా ఉందని కమల్ హాసన్ అన్నారు. అవినీతి, మతతత్వ పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఆయన చాల తక్కువ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారని కమల్ హాసన్ చెప్పారు. ప్రజల్లో చైతన్యం (విప్లవం) తీసుకురావడానికి అవసరం అయితే కేజ్రీవాల్ తో కలిసి పని చేస్తానని కమల్ హాసన్ వివరించారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ సినిమా రంగంలో ఎంతో సేవ చేసిన కమల్ హాసన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. కమల్ హాసన్ రాజకీయాల్లోకి వస్తే ఇలాగే భేటీ అవుతానని కేజ్రీవాల్ అన్నారు. తాను కమల్ హాసన్ అభిమానని, ఆయన్ను కలవడం చాల సంతోషంగా ఉందని అరవింద్ కేజ్రీవాల్ వివరించారు. ఆప్ లోకి కమల్ హాసన్ ను కేజ్రీవాల్ ఆహ్వానించారని తెలిసింది. అయితే ఈ విషయంపై ఇద్దరూ క్లారిటీ మాత్రం ఇవ్వలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+