Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Kamalakar Bhat: జ్యోతిష్యం పేరుతో మహిళలు ట్రాప్..సెలబ్రిటీ నుంచి కటకటాల వరకు..!!

Kamalakar Bhat : మన భారతదేశంలో జ్యోతిష్యానికి చాలా ప్రాధాన్యత ఉంది. జ్యోతిష్యశాస్త్రం తెలిసిన వారు చాలామందే ఉన్నారు. కొందరు జ్యోతిష్యాన్నే నమ్ముకుని జీవితం వెల్లదీస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ కొందరు అత్యాశపరులు జ్యోతిష్యం పేరుతో గలీజు దందాకు దిగుతున్నారు. వారిని నమ్మి వచ్చే వారికి జ్యోతిష్యం పేరుతో దోచుకుంటున్నారు. ఇదో రకమైన దందాగా మారింది. దొరకనంత వరకు అంతా దొరలే.. బట్ వన్స్.. దొరికాక అప్పటి వరకు దైవం దేవుడు అని కీర్తించినవారే శపిస్తున్నారు. తాజాగా కర్నాటకలో ఓ దొంగ జ్యోతిష్కుడి బాగోతం బట్టబయలైంది. చివరకు జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు.

కర్నాటకలో స్టార్ అస్ట్రాలజర్
కమలాకర్ భట్.. మన తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పాపులర్ కాదేమో కానీ...కర్నాటకకు వెళ్లి అడిగితే టక్కున చెప్పేస్తారు. ఈయనకు క్లయింట్స్‌ కూడా చాలా ఎక్కువమందే ఉన్నారు. జ్యోతిష్యం చెబుతూ కొన్ని కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు. అయితే తాను చెప్పిన జ్యోతిష్యం వచ్చే క్లయింట్స్ పట్ల నిజమైందో లేదో తెలియదుగానీ ఈ మహానుభావుడు మాత్రం బాగానే సంపాదించాడు.కర్నాటకలో ప్రముఖ జ్యోతిష్కుల్లో ఒకరిగా నిలుస్తూ టీవీ ఛానెల్స్‌లో జ్యోతిష్యం చెబుతూ సెలబ్రిటీ హోదాను అనుభవించాడు. అంతా బాగానే వెళుతున్న సమయంలో కర్మంటూ ఒకటుంటుంది కదా.. అదే ఈ దొంగ స్వామిని పట్టించింది. ఇంతకీ ఏం జరిగింతో తెలుసా...

kamalakar-bhat-crores-earned-secret-affair-life-destroyed-karnataka-astrologer-s-dark-truth-revealed

అసలు స్టోరీ ఇదే..

కమలాకర్ భట్ తన దగ్గరకు వచ్చే వారికి జ్యోతిష్యం చెప్పేవాడు. అదే సమయంలో బాగానే దండుకునేవాడు కూడా. ఇలా జ్యోతిష్యం చెప్పించుకునేందుకు కొంత కాలం క్రితం మహేష్ నాయక్, సుచిత్ర నాయక్ అనే దంపతులు కమలాకర్ వద్దకు వెళ్లారు. షిమోగ కేంద్రంగా జ్యోతిష్యాలయం నిర్వహిస్తున్నాడు కమలాకర్. ఇక జ్యోతిష్యం పక్కన పెట్టి సుచిత్రపై కన్నేశాడు ఈ కామాంధుడు కమలాకర్. మొత్తానికి ఆమెను బుట్టలో పడేశాడు. అక్రమ సంబంధం నెరిపాడు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... కొన్ని రోజులుగా సుచిత్ర తన ఇద్దరి కూతుళ్లతో కమలాకర్ వద్దే ఉంటోంది. ఒక కూతురు అక్కడి నుంచి వెళ్లీపోయి సిద్ధాపూర్‌లోని తండ్రి చెంతకు చేరింది. కాలం కనికరించినంత వరకు వీరిద్దరి ఆటలు బాగానే సాగాయి. అయితే పాపం అనేది ఎప్పడో ఒకసారి ఏదో ఒక రూపంలో బయటపడుతుంది. సరిగ్గా వీరి విషయంలో కూడా అది బయటపడింది. సుచిత్ర భర్త మహేష్ నాయక్‌కు జరిగిన విషయం తెలిసింది. అంతే ఇక ఆగ్రహం ఆవేశంతో రగిలిపోయాడు. వెంటనే సిద్ధాపూర్ పోలీస్ స్టేషన్‌లో కమలాకర్, సుచిత్రలపై ఫిర్యాదు చేశాడు.

మహేష్ పై దాడికి దిగిన సుచిత్ర

ఇక ఇది తెలిసి సుచిత్ర, ఆమె తండ్రితో పాటు మరికొందరు మహేష్ నివాసం ఉంటున్న అవెరగుప్ప గ్రామానికి వెళ్లారు. అక్కడికి కమలాకర్ ఏర్పాటు చేసిన కారులో వెళ్లారు.మాట్లాడుదామని వెళ్లిన వీరు గొడవకు దిగారు. మాటలు కాస్తా దాడుల వరకు వెళ్లాయి.మహేష్ మామ అయిన వసంత్ నాయక్ ఇంటి వద్ద ఈ పంచాయితీ జరిగింది.సుచిత్ర వర్గం మహేష్ నాయక్ వర్గంపై దాడికి దిగింది. వీరు కూడా వారిపై దాడి చేశారు. దీంతో ఇరువురిని ఆపుదామని మధ్యలో వెళ్లిన వసంత్ నాయక్‌కు కత్తిపోట్లు దిగడంతో తీవ్ర రక్తస్రావంకు గురై అక్కడే కుప్పకూలిపోయాడు.హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు.ఇక మహేష్ నాయక్‌తో పాటు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వారు షిమోగాలోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

వసంత్ నాయక్ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కమలాకర్ భట్‌, సుచిత్రలతో పాటు మొత్తం ఏడుగురిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.హత్య, హత్యాయత్నం, క్రిమినల్ కుట్ర కేసులను పోలీసులు నమోదు చేశారు. ప్రత్యక్షసాక్షులను సైతం విచారణ చేశారు. కాల్ రికార్డులను కూడా పరిశీలిస్తూ దర్యాప్తును వేగవంతం చేశారు.దీనంతటికీ కారణమైన కమలాకర్‌ను తమకు అప్పగించాలంటూ సిద్దాపురా పోలీస్ స్టేషన్ బయట ధర్నాకు దిగారు మృతుడు వసంత్ నాయక్ బంధువులు.అంతేకాదు వసంత్ నాయక్ కుటుంబానికి రూ.కోటి పరిహారంగా చెల్లించాలంటూ డిమాండ్ చేశారు.

కమలాకర్ భట్ నేపథ్యం ఏంటి..?

కమలాకర్ ఒక సాధారణ సామాన్య వ్యక్తి. జ్యోతిష్యంలోకి రాకముందు ఆయన గతం గురించి పోలీసులు ఆరా తీశారు. దీంతో నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి. ఒక జ్యోతిష్కుడిగా సెలబ్రిటీ హోదా అనుభవిస్తున్న కమలాకర్ ఒకప్పుడు తమలపాకులు, మరమరాలు అమ్మాడు. అయితే డబ్బులు చాలా ఈజీగా సంపాదించే మార్గం జ్యోతిష్యం అని తన స్నేహితుడు కమలాకర్‌కు సలహా ఇచ్చాడు. దీంతో 2005లో కేరళకు వెళ్లి జ్యోతిష్యం చెప్పడం నేర్చుకున్నాడు. అలా చిన్నగా డబ్బులు బాగానే సంపాదించాడు. అంతేకాదు తన దగ్గరకు క్లయింట్లను తీసుకొచ్చే ఏజెంట్లకు కమీషన్లు కూడా ఇచ్చేవాడు. ఇలా కోట్లు సంపాదించేశాడు.ఈ క్రమంలోనే సుచిత్రను ట్రాక్‌లో పెట్టి అక్రమ సంబంధం నడిపాడు. చివరకు కటకటాల పాలయ్యాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+