గోల్‌గప్పా అమ్ముకోవాలా?: స్వామి అవిముక్తేశ్వరానందపై కంగనా రనౌత్ ఫైర్
జ్యోతిర్ మఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానందపై బీజేపీ ఎంపీ, ప్రముఖ బాలీవుడ్ నటి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్రోహి అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను ఉద్దేశించి అవిముక్తేశ్వరానంద వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. రాజకీయ నాయకులు రాజకీయాలు చేయకుండా పానీపూరీ అమ్ముకోవాలా? అని ఘాటుగా స్పందించారు.
ఇటీవల ముంబైలో మాజీ సీఎం ఉద్దవ్ థాక్రేతో స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సమావేశమయ్యారు. ఆ తర్వాత మీడియాతో అవిముక్తేశ్వరానంద మాట్లాడుతూ.. ఉద్ధవ్ థాక్రేకు కొందరు ద్రోహం చేశారని చాలా మంది ప్రజలు వేదనకు గురవుతున్నారని అన్నారు. థాక్రేను మోసం చేసిన వారిపై ప్రజల వ్యతిరేకత ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిబింబించిందని వ్యాఖ్యానించారు.

ఉద్దవ్ మళ్లీ సీఎం అయ్యేవరకు ప్రజల బాధ తీరని అన్నారు అవిముక్తేశ్వరానంద. సీఎం ఏక్‌నాథ్ షిండేను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ క్రమంలో కంగనా రనౌత్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
'దేశద్రోహి వ్యాఖ్యలతో ఆయన(అవిముక్తేశ్వరానంద) మహారాష్ట్ర ప్రజలందరి మనోభావాలు దెబ్బతీశారు. రాజకీయాల్లో పొత్తులు, పార్టీల విభజన వంటివి సాధారణం. రాజ్యంగబద్దంగా ఆమోదయోగ్యం. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత నుంచి ఇప్పటి వరకు పలుమార్లు చీలిపోయింది. రాజకీయ నాయకులు రాజకీయాలు చేయకుండా గోల్‌గప్పా(పానీపూరీ) అమ్ముకుంటారా?' అంటూ కంగనా చురకలంటించారు.
राजनीति में गठबंधन , संधि और एक पार्टी का विभाजन होना बहुत सामान्य और संवैधानिक बात है, कांग्रेस पार्टी का विभाजन 1907 में और फिर 1971 में हुआ, अगर राजनीति में राजनीतज्ञ राजनीति नहीं करेगा तो क्या गोलगप्पे बेचेगा?
— Kangana Ranaut (@KanganaTeam) July 17, 2024
शंकराचार्य जी ने उनकी शब्दावली और अपने प्रभाव और धार्मिक शिक्षा… https://t.co/UV2KuLwVUz
కాగా, మహావికాస్ అఘాడీ కూటమిలో ఉన్న శివసేనపై ఏక్‌నాథ్ షిండే వర్గం తిరుగుబాటు చేయడంతో 2022 జూన్‌లో ఆ ప్రభుత్వం కూలిపోయిన విషయం తెలిసిందే. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏక్‌నాథ్ షిండే శివసేన మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కొనసాగిస్తున్నారు. బీజేపీతో కలవడంతో షిండేకే సీఎం బాధ్యతలను కట్టబెట్టారు.












Click it and Unblock the Notifications