మోడీని చంద్రబాబు బాగా నమ్మారు: టీడీపీ దీక్షకు కనిమొళి మద్దతు, కేంద్రంపై పైర్
కడప: స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, బీటెక్ రవిల దీక్షకు డీఎంకే పార్టీ నాయకురాలు కనిమొళి మంగళవారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఏడు రోజులుగా దీక్ష చేస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవడం దారుణం అని మండిపడ్డారు.
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్నదమ్ముల లాంటి వారని చెప్పారు. రాష్ట్రాల గురించి కేంద్రం పూర్తిగా మరిచిపోయిందని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రత్యేక హోదాను తుంగలో తొక్కిందన్నారు. బీజేపీకి హిందుత్వం తప్ప, మరో సమస్య పట్టదన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల వైపు నిలబడతారని భావించి చంద్రబాబు నాయుడు ఆయనను నమ్మారని, విశ్వసించారని, అందుకే మద్దతు పలికారని ఆమె చెప్పారు. కానీ ప్రధాని అందరి నమ్మకాన్ని వమ్ము చేశారన్నారు. బీజేపీ ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదన్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోడీ హోదా ఇస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు మరిచిపోయారన్నారు. బీజేపీ అసలు రంగు ఇప్పుడు బయటపడిందన్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications