ఏం పోయేకాలం ?, తిరుమల గతంలో బౌద్ద మందిరం అంటూ హీరో పిచ్చి కూతలు !
బెంగళూరు/తిరుమల: నిత్యం హిందువులను, హిందూ సంఘాలను టార్గెట్ చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కన్నడ హీరో చేతన్ అలియాస్ చేతన్ అహింసా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి గుడిని టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేసిన కన్నడ నటుడు చేతన్ మీద నీకు ఏంపోయేకాలం వచ్చింది అంటూ హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.
తిరుమలలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయానికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రపంచంలోని అతి పెద్ద రెండో పుణ్యక్షేత్రం అయిన తిరుమలకు ప్రతిరోజు కొన్ని వేల మంది భక్తులు వెళ్లి వస్తుంటారు. ప్రపంచ ప్రసిద్ది చెందిన తిరుమలకు దేశ విదేశాల నుంచి భక్తులు వెళ్లి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.

అలాంటి వేల సంవత్సరాల చరిత్ర కలిగిన తిరుమల ఆలయం బౌద్ద మందిరం అంటూ కన్నడ నటుడు చేతన్ అంటున్నాడు. ఇటీవల నేషనల్ టీవీ అనే యూట్యూబ్ చానల్ కు ఇంటర్వూ ఇచ్చిన చేతన్ తిరుమల గురించి సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచి ఫ్రీ పబ్లిసిటి సంపాధించుకోవాలని ప్రయత్నించాడు.
సినిమాలు లేకపోవడంతో ఆవేదనకు గురైన నటుడు చేతన్ తాను సామాజిక సేవా కార్యకర్త అంటూ తిరుగుతూ హిందూ సమాజంపై విషం కక్కుతున్నాడని ఇప్పటికే అనేక హిందూ సంఘ, సంస్థలు మండిపడుతున్నాయి. ఇటీవల ఊరిగౌడ-నంజేగౌడ అనే కన్నడ సినిమా విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చేతన్ ను బెంగళూరు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.
ఇటీవలే బెయిల్ మీద బయటకు వచ్చిన కన్నడ నటుడు చేతన్ ఇప్పుడు ప్రసిద్ది చెందిన పుణ్యక్షేత్రం తిరుమల మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడు. చరిత్రను తిరగరాస్తే తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం గతంలో బౌద్ద మందిరం అని, బౌద్ద మందిరాలను ఆక్రమించుకుని వాటిని దేవాలయాలుగా మార్చేశారని కన్నడ నటుడు చేతన్ ఆరోపిస్తున్నాడు.
నేషనల్ టీవీ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వూ లింక్ ను కూడా చేతన అతని ఫేస్ బుక్ పేజ్ లో లింక్ చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. మరోసారి జైలుకు వెళ్లాలని అనుకుంటున్న కన్నడ నటుడు చేతన్ తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని కొందరు హిందువులు మండిపడుతున్నారు. మొత్తం మీద చేతిలో సినిమాలు లేకపోవడంతో నటుడు చేతనకు మతిపోయినట్లు అయ్యిందని పలువురు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications