Chandrayaan 3: విక్రమ్ ల్యాండ్ అయిన ప్రాంతానికి బెంగళూరు పేరు ? !

బెంగళూరు: చంద్రుని దక్షిణ ధృవం వద్ద చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ అయిన ప్రాంతానికి ఇస్రో బెంగళూరు, లేదా బెంగళూరు అని పేరు పెట్టడంపై చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు చంద్రయాన్ 3 వియవంతం కావడం, విక్రమ్ ల్యాండ్ అయిన ప్రదేశానికి పేరు పెట్టాలని యోచిస్తున్నారని తెలిసింది. అయితే ఆ ప్రాంతానికి ఇస్రో బెంగళూరు లేదా బెంగళూరు పెట్టాలని కన్నడ సంఘాలు అంటున్నాయి.

ఆగస్టు 23న చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంలో విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. దక్షిణ ధృవం వద్ద సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన మొదటి దేశంగా భారత్ చరిత్రలో నిలిచిపోయింది. చంద్రయాన్ 3 ల్యాండింగ్ తర్వాత విక్రమ్ మాడ్యూల్ నుండి రోవర్, ప్రజ్ఞాన్, ల్యాండర్ బయటకు వచ్చి తమ శాస్త్రీయ ప్రయోగాలను ప్రారంభించాయి.

Chandrayaan 3

మూన్ ల్యాండింగ్ సైట్‌కు బెంగళూరు లేదా ఇస్రో బెంగళూరు అని పేరు పెట్టాలని కన్నడ అనుకూల సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతూ ఇప్పటికే అభిప్రాయాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. చంద్రయాన్ -3లో కీలక పాత్ర పోషించిన చాలా మంది ఇస్రో శాస్త్రవేత్తలు కర్ణాటకకు చెందినవారే అని, ఇస్రో ప్రధాన కార్యాలయం కూడా బెంగళూరులోనే ఉందని కర్ణాటక రక్షణా వేదిక అధ్యక్షుడు ప్రవీణ్ శెట్టి అంటున్నారు.

అందుకే చంద్రయాన్- 3 చంద్రుడిపై దిగిన ప్రదేశానికి బెంగళూరు పేరు పెట్టాలని కర్ణాటక రక్షణఆ వేదిక అధ్యక్షుడు ప్రవీణ్ శెట్టి ప్రభుత్వానికి మనవి చేశారు. కన్నడ అనుకూల సంస్థల పట్టుబట్టడంపై స్పందించిన ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ (ఇస్‌ట్రాక్) డైరెక్టర్ బీఎన్ రామకృష్ణ ఈ పేర్లు పెట్టే విషయంలో ఇస్రో అత్యున్నత స్థాయిలో చర్చిస్తాం అని అన్నారని కన్నడ మీడియా తెలిపింది.

ఇది ప్రజల కోరిక. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. చంద్రుడిపై అడుగుపెట్టిన నాలుగో దేశం మనది. గతంలో మరో మూడు దేశాలు కూడా పేర్లు పెట్టాయి. మేము ఖచ్చితంగా చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన ఆ ప్రాంతానికి ఓ పేరు పెడతాము. దీనిపై ఉన్నతాధికారులతో చర్చిస్తాం. ప్రస్తుతం మేము ఏ పేరు పెట్టాలి అని ఇంకా చర్చలు జరపలేదు. ఉన్నతస్థాయిలో చర్చలు జరిపిన తరువాత ఓ నిర్ణయం తీసుకుంటామని అధికారులు అంటున్నారు.

2019లో చంద్రయాన్-2 ప్రయోగించిన సమయంలో ఈ విషయంపై మొదట చర్చ జరిగింది. ఇస్రో మాజీ ఛైర్మన్ కె. శివన్ చంద్రయాన్ 2 ల్యాండ్ అయిన ప్రాంతానికి నామకరణం చేస్తామని అప్పట్లో చెప్పారు. చంద్రుడిపై ల్యాండర్ దిగిన తర్వాత ఏ పేరు పెట్టాలి అని పేరు ఖరారు చేస్తామని అప్పటి ఇస్రో చైర్మన్ శివన్ చెప్పారు. చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ కావడంలో విఫలం కావడంతో ఆ ఆలోచనను విరమించుకున్నట్లు ఆయన తెలిపారు.

Chandrayaan 3:

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం బెంగళూరు చేరుకుని ఇస్రో శాస్త్రవేత్తలతో సమావేశం కానున్నారు. చంద్రయాన్-3 మిషన్ విజయవంతం అయినందుకు అభినందనలు తెలిపడానికి ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం శాస్త్రవేత్తలతో సమావేశం కానున్నారు. ఆ సమయంలో విక్రమ్ ల్యాండ్ అయిన ప్రదేశానికి పేరు పెట్టడంపై చర్చ జరుగుతుందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఇస్రో శాస్త్రవేత్తలు చర్చలు జరిపిన తరువాత చంద్రయాన్ 3 నుంచి విక్రమ్ ల్యాండ్ అయిన ప్రాంతానికి ఏ పేరు పెట్టాలి అనే ఓ నిర్ణయం తీసుకోనున్నారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+