కర్ణాటక బంద్: అమిత్ షా బహిరంగ సభ: బీజేపీని టార్గెట్ చేసిన సీఎం: అందుకే మద్దతు!

బెంగళూరు/మైసూరు: మహాదాయి నీటి పంపిణి విషయంలో బీజేపీ రాజకీయం చేస్తోందని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి ఆరోపిస్తోంది. గోవాలో బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉందని, ప్రధాని నరేంద్ర మోడీ, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ చర్చించి సమస్య పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అయితే అమిత్ షా, బీజేపీని టార్గెట్ చేసుకుని గురువారం కర్ణాటక బంద్ కు సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం మద్దతు ప్రకటించిందని ఆరోపణలు వస్తున్నాయి.

Recommended Video

    Karnataka Bandh at Bangalore : బెంగళూరు లో ప్రజల కష్టాలు, వీడియో
    బీజేపీ పరివర్తనా యాత్ర

    బీజేపీ పరివర్తనా యాత్ర


    కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగానే బీజేపీ కర్ణాటకలోని అన్ని శాసన సభ నియోజక వర్గాల్లో పరివర్తనా యాత్ర పేరుతో పర్యటించి కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోస్తోంది.

    మాజీ సీఎం యడ్యూరప్ప

    మాజీ సీఎం యడ్యూరప్ప

    కర్ణాటకలోని 225 శాసన సభ నియోజక వర్గాల్లో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ ఆ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప గత మూడు నెలలుగా పర్యటిస్తున్నారు. ఐదు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభివృద్ది చెయ్యలేదని మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆరోపిస్తున్నారు.

    అమిత్ షా టార్గెట్ ?


    బీజేపీ చేపట్టిన కర్ణాటక పరివర్తనా యాత్ర గురువారం మైసూరు చేరుకుంటుంది. మైసూరులోని మహారాజ కాలేజ్ మైదానంలో జరిగే బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరు అవుతున్నారు. ఈ సందర్బంగా బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కాకుండా చెయ్యాలని కర్ణాటక ప్రభుత్వం పక్కా ప్లాన్ వేసి బంద్ కు మద్దతు ప్రకటించిందని ఆరోపణలు ఉన్నాయి.

    సీఎంకు సవాల్

    సీఎంకు సవాల్

    కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సొంత జిల్లా అయిన మైసూరులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బహిరంగ సభ సక్సస్ అయితే మొదటికే మోసం వస్తోందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అందుకే కన్నడ సంఘాలు చేస్తున్న కర్ణాటక బంద్ కు మద్దతు ప్రకటించి అమిత్ షా బహిరంగ సభ అట్టర్ ప్లాప్ చెయ్యాలని సిద్దరామయ్య పక్కా ప్లాన్ చేశారని తెలిసింది.

     ఎంపీ ప్రతాప్ సింహా

    ఎంపీ ప్రతాప్ సింహా

    అమిత్ షా బహిరంగ సభ ఉండటం వలనే మైసూరు నగరంలో సిటీ బస్సు సర్వీసులు, గ్రామీణ బస్సు సర్వీసులను కావాలనే సీఎం సిద్దరామయ్య నిలిపివేయించారని మైసూరు-కొడుగు లోక్ సభ నియోజక వర్గం ఎంపీ (బీజేపీ) ప్రతాప్ సింహా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బస్సు సర్వీసులు ప్రారంభించాలని ఎంపీ ప్రతాప్ సింహా అధికారులకు చెప్పారు.

    మైసూరులో బంద్ కు !

    మైసూరులో బంద్ కు !

    మైసూరులో బంద్ కు మిశ్రమ స్పంధన వచ్చింది. ప్రయివేటు వాహనాలు, విద్యాసంస్థలు ఎప్పటిలాగే కొనసాగాయి. బీజేపీ నాయకులు, కార్యకర్తలు బంద్ ను అడ్డుకున్నారు. అమిత్ షా బహిరంగ సభకు కార్యకర్తలను తరలించే పనిలో బీజేపీ నాయకులు నిమగ్నం అయ్యారు.

    బీజేపీకి పరువు ప్రతిష్ట !

    బీజేపీకి పరువు ప్రతిష్ట !


    బంద్ జరిగినా బీజేపీ పరివర్తనా యాత్ర, బహిరంగ సభ సక్సస్ చెయ్యాలని బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయివేటు వాహనాల్లో బీజేపీ కార్యకర్తలను అమిత్ షా బహిరంగ సభకు తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గురువారం మద్యాహ్నం 2.30 గంటలకు మహారాజ కాలేజ్ మైదానంలో అమిత్ షా బహిరంగ సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. అయితే బహిరంగ సభ ఎంతమాత్రం సక్సస్ అవుతుందో ? లేదో ? చూడాలి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+