Actress: తెలుగు నటుడు టార్చర్ పెట్టాడు, అందుకే సౌజన్యా ఆత్మహత్య, కేసు పెట్టిన నటి తండ్రి, ఎవరు ? !
బెంగళూరు/ హైదరాబాద్: కన్నడ నటి సౌజన్యా అలియాస్ సవి మాదప్ప ఆత్మహత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. కన్నడ, తెలుగు టీవీ సీరియల్స్ నటుడు తన కుమార్తెకు టార్చర్ పెట్టడం వలనే ఆమె ఆత్మహత్య చేసుకుందని నటి సౌజన్యా తండ్రి మాదప్ప బెంగళూరులో పోలీసు కేసు పెట్టారు. ఇప్పుడిప్పుడే జీవితంలో స్థిరపడుతున్న తన కుమార్తె సౌజన్యా వెంటపడిన ఆ నటుడు తనను పెళ్లి చేసుకోవాలని ఆమెను చిత్రహింసలకు గురి చేశాడని, ఆ టార్చర్ తట్టుకోలేని తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని సౌజన్యా అలియాస్ సవి మాదప్ప తండ్రి మాదప్ప బెంగళూరులోని కుంబళగూడు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. నటి సౌజన్యా ఆత్మహత్య చేసుకున్న తరువాత ఆమె ప్రియుడు తప్పించుకుని పారిపోవడంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. నటి సౌజన్యా ఆత్మహత్య చేసుకున్న రోజు ( సెప్టెంబర్ 30వ తేదీ గురువారం) ఆమె ఇంటి దగ్గరకు తెలుగు, కన్నడ టీవీ సీరియల్స్ లో నటిస్తున్న నటుడు వచ్చి వెళ్లాడని సౌజన్యా తండ్రి మాదప్ప ఆరోపించారు.

కన్నడ నటి సౌజన్యా
కర్ణాటకలోని కొడుగు జిల్లాలోని కుశాలనగరకు చెందిన సౌజన్యా అలియాస్ సవి మాదప్ప నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంది. బెంగళూరు చేరుకున్ సౌజన్యా పలు కన్నడ టీవీ సీరియల్స్ లో నటిస్తోంది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న సౌజన్యాకు మంచి భవిష్యత్తు ఉందని టీవీ రంగానికి, సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఇంతకు ముందే అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఫ్యామిలీకి దూరంగా బెంగళూరులో సౌజన్యా
కన్నడ టీవీ సీరియల్స్, సినిమాల్లో నటిస్తున్న సౌజన్యా కుటుంబ సభ్యులు కోడుగు జిల్లాలోని కుశాలనగర ఊరిలో నివాసం ఉంటున్నారు. సౌజన్యా తండ్రి మాదప్ప అప్పుడప్పుడు బెంగళూరు వచ్చి కూతురు యోగక్షేమాలు తెలుసుకుని వెలుతున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని బెంగళూరు దక్షిణ తాలుకా దోడ్డబెలే ఏరియాలో సౌజన్యా ఆమె బాయ్ ఫ్రెండ్ తో కలిసి అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నదని సమాచారం.

విషయం తెలుసుకుని బాయ్ ఫ్రెండ్ ఎస్కేప్
గురువారం ఉదయం సౌజన్యా ప్రియుడు అపార్ట్ మెంట్ లో నుంచి బయటకు వచ్చి టిఫిన్ తీసుకురావడానికి హోటల్ కు వెళ్లాడు. ప్రియుడు అపార్ట్ మెంట్ లోకి అడుగుపెట్టి చూడగా నటి సౌజన్యా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది, సౌజన్యా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న ఆమె ప్రియుడు అక్కడి నుంచి పరారైనాడు.

సహాయం చేసినవారికి ధన్యవాదాలు
సౌజన్యా ఆత్మహత్య చేసుకునే ముందు డెత్ నోట్ రాసిపెట్టిందని కంబళగూడు పోలీసులు అంటున్నారు. డెత్ నోట్ లో తన ఆత్మహత్యకు ఎవ్వరూ కారణం కాదు, అనారోగ్యంతో నేనే ఆత్మహత్య చేసుకుంటున్నాను, నాకు మంచి భవిష్యుత్తు ఉందని తెలుసు, అయితే ఈ జీవితం ఇంతటితో ముగిస్తున్నాను, నేను ఈ స్థాయికి రావడానికి సహాయం చేసిన నా కుటుంబ సభ్యులు, బంధువులు, టీవీ, సినీ రంగ ప్రముఖులకు ధన్యవాదాలు, అమ్మా, నాన్నా, అన్నయ్య నన్ను క్షమించండి, నేను ఇంటికి రావాలని అనుకున్నాను, కానీ ఇలా శవమై వస్తానని అనునకోలేదు అని నటి సౌజన్యా రాసి ఉందని పోలీసులు చెప్పారు.

మూడు రోజుల ముందే డెత్ నోట్
నటి సౌజన్యా అలియాస్ సవి మాదప్ప సెప్టెంబర్ 27వ తేదీ డెత్ నోట్ రాసిపెట్టిందని పోలీసులు అంటున్నారు. ఆత్మహత్య చేసుకోవాలని నటి సౌజన్యా ముందుగానే నిర్ణయం తీసుకుందని, అందుకే డెత్ నోట్ రాసిపెట్టిందని ఓ సీనియర్ పోలీసు అధికారి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం బెంగళూరులోని ఆర్ఆర్ ఆసుపత్రిలో నటి సౌజన్యా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసు అధికారులు అంటున్నారు.

వాడే కారణం అంటూ కేసు పెట్టిన నటి తండ్రి
కన్నడ, తెలుగు టీవీ సీరియల్స్ నటుడు తన కుమార్తెకు టార్చర్ పెట్టడం వలనే ఆమె ఆత్మహత్య చేసుకుందని సౌజన్యా తండ్రి మాదప్ప బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడిప్పుడే జీవితంలో స్థిరపడుతున్న తన కుమార్తె సౌజన్యా వెంటపడిన ఆ నటుడు తనను పెళ్లి చేసుకోవాలని ఆమెను చిత్రహింసలకు గురి చేశాడని సౌజన్యా తండ్రి మదప్ప పోలీసులకు చెప్పారు.

ఆ రోజు ఇంటికి ఆ నటుడు వచ్చాడు
టీవీ నటుడి టార్చర్ తట్టుకోలేని తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని సౌజన్యా అలియాస్ సవి మాదప్ప తండ్రి మాదప్ప బెంగళూరులోని కుంబళగూడు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. నటి సౌజన్యా ఆత్మహత్య చేసుకున్న తరువాత ఆమె ప్రియుడు తప్పించుకుని పారిపోవడంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Recommended Video

ప్రియుడు చిక్కితే మ్యాటర్ బయటకు వస్తుంది
నటి సౌజన్యా ఆత్మహత్య చేసుకున్న రోజు ( సెప్టెంబర్ 30వ తేదీ గురువారం) ఆమె ఇంటి దగ్గరకు తెలుగు, కన్నడ టీవీ సీరియల్స్ లో నటిస్తున్న నటుడు వచ్చి వెళ్లాడని సౌజన్యా తండ్రి మాదప్ప ఆరోపించారు. సౌజన్యా ప్రియుడి కోసం తాము గాలిస్తున్నామని, అతను చిక్కితే మ్యాటర్ మొత్తం బయటకు వస్తుందని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు.












Click it and Unblock the Notifications