ప్రతీకారం: తమిళనాడు వాహనాలకు నిప్పు, హోటళ్లు ధ్వంసం

బెంగళూరు: కావేరీ జలాలు తమిళనాడుకు విడుదల చెయ్యరాదని కన్నడ సంఘాలు చేపట్టిన ఆందోళలు ఎక్కువ అయ్యాయి. ఇదే సందర్బంలో చెన్నై నగరంలో కన్నడిగులపై దాడులు, వాహనాలు ధ్వంసం చేశారని వెలుగు చూడటంతో కర్ణాటకలో ప్రతీకార దాడులకు దిగారు.

సోమవారం మండ్య జిల్లాలోని పాండవపురలో తమిళనాడు వ్యక్తులు నిర్వహిస్తున్న దుకాణాలను ధ్వంసం చేశారు. చేతికి చిక్కన వస్తువులు విసిరివేశారు. తమిళనాడుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Kannadigas too have vandalized shops belonging to Tamils in Karnataka

బెంగళూరు నగరంలోని మైసూరు రోడ్డులోని నాయండనహళ్ళిలో తమిళనాడుకు చెందిన లారీలు, ఓ ట్యాంకర్ కు నిప్పంటించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చచెప్పారు.

తమిళనాడు రిజిస్ట్రేషన్ నెంబర్ కనపడిన వాహనాల మీద రాళ్ల వర్షం కురిపించారు. ఇదే సందర్బంలో ఆందోళ చేపట్టిన వాటళ్ పార్టీ అధ్యక్షుడు, మాజీ శాసన సభ్యుడు వాటళ్ నాగరాజ్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.

Kannadigas too have vandalized shops belonging to Tamils in Karnataka

బెంగళూరులోని మైసూరు రోడ్డులోని శాటిలైట్ బస్ స్టాండ్ లో ఉన్న తమిళనాడుకు చెందిన ఆనంద్ భవన్ హోటల్ ను పూర్తిగా ధ్వంసం చేశారు. ఆందోళనలు ఎక్కువకావడంతో పోలీసులు నాలుగు సార్లు లాఠీచార్జ్ చేశారు. పలువురు ఆందోళనాకారులను అరెస్టు చేశారు. పారా మిలటరీ బలగాలను రంగంలోకి దింపారు.

Kannadigas too have vandalized shops belonging to Tamils in Karnataka

ఆందోళనలు ఎక్కవ కావడంతో తమిళనాడు వైపు వెలుతున్న అన్నీ కేఎస్ఆర్ టీసీ బస్సు సర్వీసులు నిలిపివేశారు. ముందు జాగ్రత్త చర్యగా తమిళ ప్రజలు ఎక్కువగా నివాసం ఉంటున్న ప్రాంతాల్లో అదనపు బలగాలను మొహరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+