కర్ణాటక బంద్, బంద్ అంటే ఇదే బాసు, 44 విమానాలు రద్దు, రక్తం ఇస్తాం కాని నీళ్లు ఇవ్వం !
బెంగళూరు: కావేరి (cauvery) జలాలు కోసం పోరాటం చేస్తున్నన కన్నడిగులు శుక్రవారం కర్ణాటక బంద్ (karnataka bandh)కు పిలుపునిచ్చారు. శుక్రవారం కర్ణాటక బంద్ కు ప్రజలు ఊహించని మద్దతు తెలుపుతున్నారు. రక్తం అయినా ఇస్తాము కాని తమిళనాడుకు కావేరీ నీళ్లు ఇవ్వలేమనే నినాదాలతో కర్ణాటక దద్దరిల్లుతున్నది. కావేరి (cauvery)జలాల కోసం ఎంతవరకు అయినా పోరాటం చేస్తామని కన్నడిగులు అంటున్నారు.
గత మంగళవారం బెంగళూరు బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన బెంగళూరు (Bengaluru) ప్రజలు రెండు రోజుల గ్యాప్ తో జరుగుతున్న కర్ణాటక బంద్ కు బెంగళూరు ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కర్ణాటక బంద్ (karnataka bandh)సందర్బంగా బెంగళూరు నగర శివార్లలోని దేవనహళ్లి సమీపంలోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (బెంగళూరు (Bengaluru) అంతర్జాతీయ విమానాశ్రయం)కు విమానాల (Airport) రాకపోకలు నిలిచిపోవడంతో ఎయిర్ పోర్టు ఖాళీగా దర్శనం ఇస్తున్నది.

నిత్యం విమానాలు (Airport), క్యాబ్ లు, ట్యాక్సీలు, ప్రయాణికులతో కిటకిటలాడే బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం బోసిపోయింది. అఖిల కర్ణాటక బంద్ సందర్బంగా విమానాల్లో (Airport) బెంగళూరు (Bengaluru)రావడానికి ప్రయాణికులు ఆసక్తి చూపించకపోవడంతో 44 విమాన సర్వీసులు రద్దు చేశారని కన్నడ మీడియా తెలిపింది.
44 విమాన (flights) సర్వీలు పూర్తిగా నిలిచిపోవడంతో బెంగళూరు (Bengaluru)అంతర్జాతీయ ఎయిర్ పోర్డు రోడ్లు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. నమ్మ బెంగళూరు (Bengaluru) మెట్రో రైలులో (మెట్రో రైలు)లో ప్రయాణికులు అంతంతమాత్రంగానే దర్శనం ఇచ్చారు. ఇక కర్ణాటక (karnataka bandh) అనుబంధ సంస్థలు అయిన కేఎస్ఆర్ టీసీ, బీఎంటీసీ బస్సులు శుక్రవారం ఉదయం డిపోల నుంచి బయటకు వచ్చాయి.

అయితే కొన్ని ప్రాంతాలకు ప్రయాణికులు లేకుండా కేఎస్ఆర్ టీసీ బస్సులు ఖాళీగా బయలుదేరి వెళ్లాయి. బంద్ ప్రభావం ఎక్కువగా ప్రాంతాలకు (karnataka bandh) కేఎస్ఆర్ టీసీ బస్సులు పూర్తిగా నిలిచిపోవడంతో బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు మెజస్టిక్ తో పాటు పలు ప్రాంతాల్లోని బస్ స్టాండ్ లకు పరిమితం అయ్యారు.
బెంగళూరులో (Bengaluru)తక్కువ సంఖ్యలో బీఎంటీసీ బస్సులు రోడ్ల మీదకు రావడంతో ప్రాయాణికులు 20 శాతం మందికూడా లేకపోవడంతో ఆ బస్సులు ఖాళీగా తిరుగుతున్నాయి. బెంగళూరు (Bengaluru)నగరంలో మాల్స్, సినిమా థియేటర్లు, షాపింగ్ కాంప్లెక్స్ లు పూర్తిగా మూసివేశారు. హోటల్స్ కు భద్రత లేకపోవడంతో బెంగళూరులోని దాదాపుగా అన్ని హోటల్స్, టిఫిన్ సెంటర్లు, బేకరీలు పూర్తిగా మూసివేశారు.

బెంగళూరు సిటీ, బెంగళూరు (Bengaluru) గ్రామీణ జిల్లా, రామనగర జిల్లా, మండ్య జిల్లా, మైసూరు జిల్లా, చామరాజనగర జిల్లా, తుమకూరు జిల్లా, కొడగు జిల్లాతో పాటు కావేరి (cauvery)జలాలతో సంబంధం ఉన్న కొన్ని జిల్లాల్లో బంద్ (karnataka bandh) ప్రభావం 100కు వంద శాతం కనపడుతోంది. బెంగళూరు (Bengaluru) సిటీతో పాటు కర్ణాటకలోని నగరాలు, పట్టణాల్లో ఎక్కడ చూసిన పోలీసులు దర్శనం ఇస్తున్నారు.
గురువారం అర్దరాత్రి బంద్ నిర్వహకులకు నోటీసులు జారీ చేసిన పోలీసులు ర్యాలీలు, బలవంతపు బంద్ లు, నిరసనలు చేపట్టకూడదని, 144 సెక్షన్ అమలులో ఉందని హెచ్చరించారు. మొత్తం మీద వారంలో రెండు రోజుల గ్యాప్ తో రెండో సారి బంద్ (karnataka bandh)జరుగుతున్నా బెంగళూరు (Bengaluru) ప్రజలు బంద్ కు సంపూర్ణ మద్దతు తెలపడంతో సిద్దరామయ్య (cm) ప్రభుత్వం అయోమయంలో పడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications