మామూలు అత్త కాదు బాబోయ్.. భర్త వద్దు.. అల్లుడే ముద్దు..!

రోజురోజుకూ మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు దిగజారి పోతున్నాయి. ఇటీవల కాబోయే అల్లుడితో ఓ అత్త పరారైన సంఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని అలీగఢ్ లో జరిగింది. అయితే ఈ ఘటనను మరువక ముందే ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. ఇది కూడా ఉత్తర్ ప్రదేశ్ లోనే జరగడం గమనార్హం.

తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పుర్ లో షాకింగ్ ఘటన జరిగింది. 20ఏళ్ల మేనల్లుడితో 45ఏళ్ల అత్త వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే ఈ విషయం భర్తకు తెలిసి పలు మార్లు గట్టిగా మందలించాడు. అయినా వారి మధ్య రిలేషన్ కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలో అడ్డుగా ఉన్న భర్తను చంపేయాలని ప్లాన్ వేశారు. అనుకున్న ప్లాన్ ప్రకారం మేనల్లుడితో స్కెచ్ వేసి భర్తను చంపి ఇంటి వెనకాల పాతిపెట్టింది భార్య. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఉత్తర్ ప్రదేశ్ కాన్పుర్ లోని లాలూపూర్ గ్రామానికి చెందిన శివ్ వీర్‌ సింగ్(50) కు భార్య లక్ష్మి(45), ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే మేనల్లుడు అమిత్‌ సింగ్‌(20)తో లక్ష్మి వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని గ్రహించి అతడ్ని చంపేందుకు అల్లుడితో కలిసి ప్లాన్ వేసింది. టీలో మత్తుమందు కలిపి ఇచ్చి.. అది తాగాక అనుమానంతో ఇనుపరాడ్డుతో కొట్టి చంపేసింది. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా భర్త శవాన్ని ఇంటి వెనకాలే గొయ్యి తవ్వింది. లవర్ సాయంతో మృతదేహాన్ని పాతి పెట్టింది. ఆ తర్వాత శవం త్వరగా కుళ్లిపోవాలని గోతిలో 10 కిలోల ఉప్పు పోసింది.

Kanpur Shocker Wife Kills Husband Over Illicit Affair with Nephew Buries Body

అయితే కొద్ది రోజులుగా శివ్ వీర్‌ సింగ్ ఆచూకీ లేకపోవడంతో స్థానికులు, కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. అయితే తన భర్త గుజరాత్ వెళ్లాడంటూ చెప్పుకొచ్చింది లక్ష్మీ. కానీ లక్ష్మిపై శివ్ వీర్‌ సింగ్ తల్లి సావిత్రి దేవికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాళ్లు తమదైన శైలిలో విచారణ జరపడంతో నిజం బయటకు వచ్చింది. విచారణలో లక్ష్మి మేనల్లుడు అమిత్ సింగ్‌ తో ఆమెకు సంబంధం ఉందని పోలీసులు తెలుసుకున్నారు. తాజాగా సెప్టెంబర్ 7 న నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+