వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కపిల్ సిబల్ సంచలనం - ఎస్పీ టికెట్ పై రాజ్యసభకు -కాంగ్రెస్ కు మే16నే రాజీనామా

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీ తీరుపై గుర్రుగా ఉన్న సీనియర్ నేత, సుప్రీంకోర్టు న్యాయవాది కపిల్ సిబల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి సమాజ్ వాదీ పార్టీ తరఫున రాజ్యసభకు పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రాజ్యసభకు ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సమక్షంలో కపిల్ సిబల్ ఇవాళ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. సిబల్‌కు సీనియర్ న్యాయవాదిగా యాదవ్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 2017 జనవరిలో (యాదవుల కుటుంబ కలహాల సమయంలో) సిబల్ ఎన్నికల సంఘం వద్ద అఖిలేష్ యాదవ్‌కు 'సైకిల్' గుర్తు కావాలని వాదించారు. చివరకు అఖిలేష్‌కే గుర్తు వచ్చింది.

Kapil Sibal files nomination for Rajya Sabha polls on sp ticket, quit congress on May 16

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ విధానాలతో విభేదిస్తూ జీ23గా ఏర్పడిన గ్రూప్ లో భాగంగా ఉన్న కపిల్ సిబల్.. పార్టీ వ్యవహారాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజ్యసభ అభ్యర్ధిత్వాన్ని తిరిగి పార్టీ రెన్యువల్ చేసే అవకాశం లేదని తేలిపోయింది. దీంతో ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి సమాజ్ వాదీ వార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ నామినేషన్ కూడా దాఖలు చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి
మే 16నే కాంగ్రెస్ పార్టీకి కపిల్ సిబల్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది .

English summary
congress senior leader kapil sibal says good bye to the party and filed nomination for rajyasabha polls on samajwadi party ticket.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X