Covid 19 : కర్నాటకలో కోవిడ్ ఆంక్షల ప్రకటన- బహిరంగ ప్రాంతాల్లో అమలు..
కర్నాటకలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. చైనా నుంచి రాష్ట్రానికి వచ్చే యాత్రికులకు ఇప్పటికే కోవిడ్ పరీక్షలు తప్పనిసరి చేసారు. అయినా కోవిడ్ వ్యాప్తి భయాలు వెంటాడుతున్నాయి. దీంతో ఇవాళ కీలక సమీక్ష నిర్వహించిన కర్నాటక ప్రభుత్వం ఆంక్షల్ని ప్రకటించింది.
కర్నాటకలో కోవిడ్ వ్యాప్తి భయాల నేపథ్యంలో ప్రభుత్వం.. ఇవాళ నిర్వహించిన సమీక్షలో అధికారులు ప్రభుత్వానికి వాస్తవ పరిస్దితి వివరించారు. దీంతో ఆరోగ్యమంత్రి ఆంక్షల ప్రకటన చేశారు. దీని ప్రకారం రాష్ట్రంలోని సినిమా థియేటర్లు, పాఠశాలలు, కళాశాలల్లో మాస్క్‌ల వాడకాన్ని తప్పనిసరి చేశారు. పబ్‌లు, రెస్టారెంట్‌లు, బార్‌లలో కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోవాలంటే మాత్రం మాస్క్‌లు తప్పనిసరి చేశారు. అలాగే నూతన సంవత్సర వేడుకలు అర్ధరాత్రి 1 గంటలోపు ముగించాలని ఆంక్షలు విధిచారు.

రాష్ట్రంలో కోవిడ్ పరిస్దితిపై స్పందించిన ఆరోగ్యమంత్రి ప్రస్తుతానికి జనం భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలని తెలిపారు. కేంద్రం కోవిడ్ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో కోవిడ్ ప్రోటోకాల్ ఆమలు ప్రారంభించారు. పరిస్దితిని బట్టి ఆంక్షలు క్రమంగా పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఢిల్లీకి వెళ్లిన సీఎం బసవరాజ బొమ్మై.. కేంద్ర ప్రభుత్వ అధికారుల్ని కలిసే అవకాశం కూడా ఉంది. దీంతో కర్నాటక ఇప్పుడు దేశంలో కరోనా ఆంక్షల అమలు తిరిగి ప్రారంభించిన తొలి రాష్ట్రంగా నిలిచింది.












Click it and Unblock the Notifications