కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: కాంగ్రెస్ కు 49 శాతం ఓట్లు, బీజేపీ, జేడీఎస్ అంతే: సర్వే!

Recommended Video

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: సర్వే!

    బెంగళూరు: కర్ణాటకలో 2018లో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 49 శాతం ఓట్లు వస్తాయని లోక్ నీతి-సీఎస్ డీఎస్ సర్వే తెలిపింది. రెండువ స్థానంలో ఉన్న బీజేపీకి 27 శాతం ఓట్లు, ప్రాంతీయ పార్టీ అయిన జేడీఎస్ మూడుస్థానికి పరిమితం అయ్యి 20 శాతం ఓట్లు సంపాధించుకుంటుందని సర్వేలో వెలుగు చూసింది.

    మూడ్ ఆఫ్ ది నేషన్

    మూడ్ ఆఫ్ ది నేషన్

    ‘మూడ్ ఆఫ్ ది నేషన్ 'పేరుతో కర్ణాటకలోని అన్ని ప్రాంతాల్లో లోక్ నీతి జాతీయ కో ఆర్డినేటర్ డాక్టర్ సందీప్ శాస్త్రీ ఆధ్వర్యంలో కర్ణాటక ప్రభుత్వం పనితీరుపై సర్వే చేశారు. డాక్టర్ సందీప్ శాస్త్రీ బెంగళూరులోని జైన్ డీమ్డ్ యూనివర్శిటి వైస్ చాన్స్ లర్ గా పని చేస్తున్నారు.

    బెంగళూరులో అసంతృప్తి

    బెంగళూరులో అసంతృప్తి

    కాంగ్రెస్ ప్రభుత్వం మీద బెంగళూరు నగరంలోని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులో 55 శాతం మంది సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని చెప్పారని సర్వే వివరించింది. 11 శాతం మంతి కాంగ్రెస్ పార్టీ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారని, మిగిలిన వారు పర్వాలేదు అని అన్నారని సర్వే చెప్పింది.

    చిన్న పట్టణాలు, గ్రామాలు!

    చిన్న పట్టణాలు, గ్రామాలు!

    చిన్న పట్టణాలు, గ్రామాల్లో ఎక్కవ శాతం కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారని సర్వే తెలిపింది. ముఖ్యంగా మైనారిటీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారని సర్వే తెలిపింది. ముంబై కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటకలోని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారని సర్వే చెప్పింది.

    సర్వే ప్రకారం!

    సర్వే ప్రకారం!

    లోక్ నీతి-సీఎస్ డీఎస్ సర్వే ప్రకారం కర్ణాటకలో 11 శాతం మంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేశారని, 46 శాతం మంది ప్రభుత్వ తీరు పర్వాలేదని, 33 శాతం మంది ఈ ప్రభుత్వం ఏం అంత గొప్పగా లేదని, 6 శాతం మంది ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని, 4 శాతం మంది ఏమీ చెప్పలేమని అన్నారని సర్వే తెలిపింది.

    నగరాల్లో కాంగ్రెస్ కు!

    నగరాల్లో కాంగ్రెస్ కు!

    బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలోని అన్ని నగరాల్లో కాంగ్రెస్ పార్టీకి అంతగా మద్దతు లేదని వెలుగు చూసింది. 9 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారని, 59 శాతం మంది ప్రభుత్వ తీరు పర్వాలేదని, 19 శాతం మంది ఈ ప్రభుత్వం ఏం అంత గొప్పగా లేదని, 9 శాతం మంది ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని, మిగిలిన వారు ఏమీ చెప్పలేమని సర్వేలో వెలుగు చూసింది.

    మైనారిటీల మద్దతు?

    మైనారిటీల మద్దతు?

    కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద మైనారిటీలు భారీ మద్దతు ప్రకటిస్తున్నారని సర్వేలో వెలుగు చూసింది. 14 శాతం మంది పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేశారని, 49 శాతం మంది ప్రభుత్వ తీరు పర్వాలేదని, 25 శాతం మంది ఈ ప్రభుత్వం ఏం అంత గొప్పగా లేదని, 6 శాతం మంది ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని, మిగిలిన వారు ఏమీ చెప్పలేమని అన్నారని సర్వే తెలిపింది.

    ఎస్సీ, ఎస్టీల మద్దతు!

    ఎస్సీ, ఎస్టీల మద్దతు!

    కర్ణాటకలోని ఎస్సీ, ఎస్టీల మద్దతు కాంగ్రెస్ పార్టీకే అంటున్నారని సర్వే చెప్పింది. 12 శాతం మంది పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేశారని, 51 శాతం మంది ప్రభుత్వ తీరు పర్వాలేదని, 32 శాతం మంది ఈ ప్రభుత్వం ఏం అంత గొప్పగా లేదని, 2 శాతం మంది ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని, 3 శాతం మంది ఏమీ చెప్పలేమని సర్వే తెలిపింది.

    దక్షిణ కర్ణాటకలో జై

    దక్షిణ కర్ణాటకలో జై

    దక్షిణ కర్ణాటకలో సిద్దరామయ్య ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మద్దతు ఉందని సర్వే వివరించింది. 9 శాతం మంది పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేశారని, 71 శాతం మంది ప్రభుత్వ తీరు పర్వాలేదని, 14 శాతం మంది ఈ ప్రభుత్వం ఏం అంత గొప్పగా లేదని, 4 శాతం మంది ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని, 2 శాతం మంది ఏమీ చెప్పలేమని లోక్ నీతి-సీఎస్ డీఎస్ సర్వే తెలిపింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+