మా రూటే సెపరేట్: కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై దేవెగౌడ పిల్లిమొగ్గలు.. కుమార ససేమిరా
Recommended Video

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ మధ్య ఎటువంటి పొత్తు కుదిరినా ఆ రెండింటికి విధ్వంసకరమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఒకవేళ బీజేపీ బలం సగానికి తగ్గించినా ఇదే పరిస్థితి నెలకొంటుందని చెబుతున్నారు. ఇప్పటికే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) అధ్యక్షుడు హెచ్ డీ దేవెగౌడతో పొత్తు కుదుర్చుకోవాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ సూచించారు.
దేవెగౌడ చాలా మంచి మనిషి, బీజేపీని ఓడించేందుకు ఆయనతో కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే బాగుంటుందని మీడియాతో అన్నారు. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్దం అని దేవెగౌడ సంకేతాలు ఇచ్చారు. అంతకుముందు హెచ్ఎస్ దొరైస్వామి అనే గాంధేయ వాది సారథ్యంలో పలువురు ప్రముఖులు దేవెగౌడతో సమావేశమై కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని మతతత్వ పార్టీ 'బీజేపీ'ని ఓడించాలని పిలుపునిచ్చారు.

జేడీఎస్ పార్టీతో పొత్తుపై అధికారికంగా స్పందించని కాంగ్రెస్
కానీ కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తామని 85 ఏళ్ల మాజీ ప్రదాని హెచ్ డీ దేవెగౌడ ప్రకటించిన నిమిషాల్లో జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు అవకాశం లేదని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఓ గంట తర్వాత దేవెగౌడ కూడా ‘యూ - టర్న్'తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేసే ఆసక్తి లేదని తేల్చి చెప్పారు. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ పార్టీ మాత్రం నోరు మెదపలేదు.

60 - 70 స్థానాల్లోనే జేడీఎస్ పార్టీకి పట్టు
పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీకి కర్ణాటకలో క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కన్నడ నేలపై కాంగ్రెస్, జనతాదళ్ (ఎస్) కనీసం 60 - 70 అసెంబ్లీ స్థానాల పరిధిలో ముఖాముఖీ పోటీ పడుతున్నాయని చెబుతున్నారు. రాష్ట్ర శాసనసభా ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ మధ్య ఎటువంటి పొత్తు కుదిరినా ఆ రెండింటికి విధ్వంసకరమేనన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ బీజేపీ బలం సగానికి తగ్గించినా ఇదే పరిస్థితి నెలకొంటుందని చెబుతున్నారు. రెండు పార్టీలు పరస్పరం ఈ పోటీ పడుతున్న స్థానాల్లో ఆయా పార్టీల శ్రేణులు పరస్పరం దెబ్బ కొట్టేందుకు పూనుకోవడం లేదు.

రాష్ట్రమంతటా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ముఖాముఖీ
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే 224 స్థానాలకు పోటీ చేస్తోంది. ప్రధాన ప్రతిపక్షం బీజేపీ 160 స్థానాల్లో మాత్రమే బలం కలిగి ఉన్నది. ఇక జేడీఎస్ 70 - 80 స్థానాలకు పరిమితమై ఉన్నది. రాష్ట్ర రాజధాని బెంగళూరు మినహా ఓల్డ్ మైసూర్ ప్రాంతంతోపాటు జేడీఎస్ పార్టీకి గట్టి పట్టు ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్, గౌడల మధ్య ముఖాముఖీ పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. మిగతా రాష్ట్రమంతటా కాంగ్రెస్, బీజేపీ ముఖముఖీ పోటీలు ఉంటాయంటున్నారు. కేవలం 25 - 30 స్థానాల పరిధిలో మాత్రమే త్రిముఖ పోటీ ఉంటుందని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్, జేడీఎస్ మధ్య పొత్తు రాజకీయంగా పొసగదని విశ్లేషకులు తెలిపారు.

జేడీఎస్ కు ఓటేయొద్దని అభ్యర్థించిన సిద్దరామయ్య
మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కర్ణాటక సీఎం సిద్దరామయ్య బహిరంగంగానే జేడీఎస్ పార్టీ నాయకత్వంపై వాగ్భాణాల దాడికి దిగారు. బీజేపీకి బీ టీంగా జేడీఎస్ వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. దేవెగౌడకు కంచుకోట వంటి హసన్, మండ్య, మైసూర్ ప్రాంతాల్లో పర్యటించిన రాహుల్ గాంధీ.. జేడీఎస్ పార్టీలోని ఎస్ పదం అంటే సంఘ్ పరివార్ అని సెక్యులర్ అని కాదని పదేపదే దాడి చేశారు. సీఎం సిద్దరామయ్య మరో అడుగు ముందుకేసి ముస్లింలు.. బీజేపీయేతర, కాంగ్రెసేతర ఓట్లు జేడీఎస్ పార్టీకి వేయొద్దని అభ్యర్థించారు.

సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని యెడ్యూరప్ప దీమా
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తామని ప్రకటించిన దేవెగౌడ.. ఎన్నికల ఫలితాల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడితే బీజేపీకి మద్దతునిస్తామని పేర్కొన్నారు. కానీ బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యెడ్యూరప్ప మాత్రం తాము సొంతంగా 150 స్థానాలు గెలుచుకుంటామని, జేడీఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరమే లేదని కొట్టి పారేశారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications