కర్ణాటకలో విన్నర్ ఎవరు ?, రన్నర్ ఎవరు ?, కింగ్ మేకర్ ఎవరు ?, లింగాయత్ ఓట్లు !

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంలో అనేక సర్వేల ఫలితాలు విడుదల అవుతున్నాయి. రాజకీయాల మీద ఆసక్తి ఉన్న వాళ్లు మాట్లాడుకోవడానికి నోటినిండా పనిపడుతోంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు ?, ఎవరు అధికారంలోకి వస్తారు ?, ఎవరు సీఎం అయితే బాగుంటుంది ?, ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయి అంటూ జీ న్యూస్-మ్యాట్రిజ్ సర్వే విడుదల చేసింది.

కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని 150 ఎమ్మెల్యే సీట్లు టార్గెట్ పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగింది. ఈసారి మేమే అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నది. 2023 అసెంబ్లీ ఎన్నికలు కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు సవాలుగా మారిపోయాయి.

Karnataka Assembly Elections 2023 Survey Results

ఇప్పటికే విడుదలైన కొన్ని సర్వేల్లో కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీని కలవరపెడుతున్నాయి. అధికార పార్టీ మీద వ్యతిరేకత ఎక్కువగా ఉందని కొన్ని సర్వేలు తెలిపాయి. ఏం చెయ్యాలి అంటూ బీజేపీ నాయకులు నానా తంటాలు పడుతున్నారు. ఇప్పుడు జీన్యూస్-మ్యాట్రిజ్ కలసి కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల సర్వే నిర్వహించి ఆ సర్వే ఫలితాలు విడుదల చేసింది.

జీన్యూస్-మ్యాట్రిజ్ సర్వే ఫలితాలతో బీజేపీ నాయకులు కొంచెం ఊపిరిపీల్చుకున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు-2023 జీన్యూస్-మ్యాట్రిజ్ సర్వేలో ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మొదటి స్థానంలో ఉంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ రెండో స్థానానికి, జేడీఎస్ పార్టీ మూడో స్థానానికి పరిమితం అయ్యాయని సర్వేలో వెలుగు చూసింది.

Karnataka Assembly Elections 2023 Survey Results

జీన్యూస్-మ్యాట్రిజ్ అసెంబ్లీ ఎన్నికల సర్వేలో బీజేపీకి 103 నుంచి 115 స్థానాలు వస్తాయని, కాంగ్రెస్ పార్టీకి 79 నుంచి 91 స్థానాలు వస్తాయని సర్వే అంచనా వేసింది. ఇక కర్ణాటకలో కింగ్ మేకర్ గా ఉన్న జేడీఎస్ పార్టీకి 26 నుంచి 36 సీట్లు వస్తాయని జీన్యూస్-మ్యాట్రిజ్ సర్వే అంచనా వేసింది.

జీన్యూస్-మ్యాట్రిజ్ సర్వే ప్రకారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 42 శాతం, కాంగ్రెస్ పార్టీ 40 శాతం, జేడీఎస్ పార్టీ 15 శాతం ఓట్లు సంపాధిస్తుందని వెలుగు చూసింది. కర్ణాటకలో అధిక సంఖ్య జనబా ఉన్న లింగాయత్ వర్గంలో ఓట్లు చీలిపోతాయని వెలుగు చూసింది. 66 శాతం లింగాయత్ లు బీజేపీకి ఓటు వేస్తారని సర్వేలో వెలుగు చూసింది.

16 శాతం లింగాయత్ లు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారని, 8 శాతం మంది లింగాయత్ లు జేడీఎస్ కు ఓటు వేస్తారని వెలుగు చూసింది. ఇక ఒక్కలిగుల్లో 52 శాతం జేడీఎస్ పార్టీకి, 28 శాతం మంది కాంగ్రెస్ పార్టీకి, 4 శాతం మంది ఇతరులకు ఓటు వేస్తారని జీన్యూస్-మ్యాట్రిజ్ సర్వే తెలిపింది. పలు సంస్థలు పలురకాలుగా సర్వేలు విడుదల చేస్తుండటంతో మే 13వ తేదీన అసలు సినిమా విడుదల అవుతుందని కన్నడిగులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+