కర్ణాటక రిజల్ట్స్: 1983 నుండి 3 సార్లు హంగ్ అసెంబ్లీ, ఏ పార్టీకి పూర్తిగా మెజారిటీ ఇవ్వని ఓటర్లు
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలో గతంలో కూడ ఓటర్లు ఏ పార్టీకి కూడ స్పష్టమైన మెజార్టీని ఇవ్వని పరిస్థితులు నెలకొన్నాయి అయితే ఈ దఫా భారీగా పెరిగిన పోలింగ్ శాతం ఏదో పార్టీకి స్పష్టమైన మెజార్టీని ఇవ్వవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం ఆ దిశగా కన్పించడం లేదు. ఈ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ దఫా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భారీగా పోలింగ్ నమోదైన నేపథ్యంలో ఓటర్లు స్పష్టమైన తీర్పును ఇస్తారనే అంచనా కూడ లేకపోలేదు. 1983, 2004, 2008లలో జరిగిన ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీకి కూడ స్పష్టమైన మెజారిటీని ఇవ్వలేదు. అయితే ఆ సమయంలో ఏర్పాటైన ప్రభుత్వాలు కొన్ని ఒడిదొడుకులను ఎదుర్కోవాల్సి వచ్చింది.

1983లో 65.67 శాతం పోలింగ్ నమోదైంది 2004లో 65.17 శాతం, 2008లో 64.68 శాతం పోలింగ్ నమోదైంది. అయితే ఓటర్లు ఏ పార్టీకి కూడ స్పష్టమైన మెజారిటీని ఇవ్వని పరిస్థితుల కారణంగా ఇతర పార్టీల మద్దతును తీసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
1983లో జనతాదళ్ బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది 2004లో కాంగ్రెస్ తో జనతాదళ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 20 మాసాల తర్వాత కాంగ్రెస్ కు చెప్పకుండానే జనతాదళ్ బిజెపితో చేతులు కలిపింది. ఆ తర్వాత బిజెపికి ఆ తర్వాత అధికారాన్ని ఇవ్వని కారణంగా రాష్ట్రంలో నెలకొన్న రాజ్యాంగ సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రపతి పాలనకు కారణమైంది.
ప్రస్తుత పరిస్థితుల్లో కూడ రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకుగాను కాంగ్రెస్, బిజెపిలు తమ వంతు ప్రయత్నాలను చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications