అసభ్య చిత్ర సన్నివేశాలకు అక్కడ కర్నాటక నో!
బెంగళూరు: చారిత్రక కట్టడాలలో సినిమా చిత్రీకరణలో అసభ్యత ఉంటే చిత్రీకరణకు అనుమతించబోమని కర్నాటక ప్రభుత్వం చెప్పింది. ప్రసిద్ధ కట్టడాలు, పర్యాటక ప్రాంతాలైన హంపీ, బాదామి గుహలు, బీదర్ కోట తదితర ప్రాంతాల్లో అసభ్యత ఉన్న చిత్రీకరణకు ఒప్పుకోమని చెప్పింది.
ఆయా ప్రాంతాల్లో ఇలాంటి షూటింగ్స్ జరపడం వల్ల తరతరాలుగా కాపాడుకుంటున్న వివిధ సంప్రదాయ కట్టడాల విలువ తగ్గుతోందని పురావస్తు శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు సినిమా చిత్రీకరణ సమయంలో వాడే క్రేన్, యంత్రాల వల్ల ఆయా కట్టడాలకు స్వల్ప ప్రమాదాలు జరిగి వాటి మనుగడే ప్రమాదకంగా మారనుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గడ్కరీ కోసం స్థానం వదులుకునేందుకు సిద్ధం..
మహారాష్ట్ర బీజేపీ విభాగం అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్‌ని పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేయవచ్చనే వార్తలు ఓ వైపు బలంగా వినిపిస్తుండగా, ఒకవేళ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గనుక ముఖ్యమంత్రి పదవిని చేపట్టినట్లయితే తన రాజకీయ గురువు కోసం తన స్థానాన్ని ఖాళీ చేస్తానని నాగపూర్ తూర్పు నియోజకవర్గం బిజెపి ఎమ్మెల్యే కృష్ణ బుధవారం చెప్పారు.

గడ్కరీ కోసం తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని రెండోసారి ఈ స్థానంనుంచి ఎమ్మెల్యేగా నెగ్గిన ఖోప్డే చెప్పారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా తీసుకు రావాలని రాష్ట్రంలో పార్టీ నేతలు కొందరు బలంగా కోరుతున్న నేపథ్యంలో ఖోప్డే ఈ ప్రకటన చేశారు.
ఈ పరిమాలపై ఫడ్నవిస్‌ను ప్రశ్నించగా ఆయన స్పందించలేదు. విదర్భ ప్రాంతానికి చెందిన సుమారు 39 మంది బీజేపీ ఎమ్మెల్యేలు మంగళవారం గడ్కరీని నాగపూర్‌లోని ఆయన నివాసంలో కలిసినప్పుడు.. మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలని అనుకోవడం లేదన్న తన వైఖరిని తాను ఇప్పటికే స్పష్టం చేశానని, నిర్ణయం తీసుకోవలసింది కేంద్ర నాయకత్వమేనని, ఏ బాధ్యతనైనా స్వీకరిస్తానుని చెప్పారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 288 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో 123 మంది ఎమ్మెల్యేలతో అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ పూర్తి మెజారిటీకి 22 మంది సభ్యులు తక్కువగా ఉన్న విషయం తెలిసిందే. మంగళవారం జరగాల్సిన బీజేపీలెజిస్లేచర్ పార్టీ సమావేశం కోసం కొత్తగా ఎన్నికయిన ఈ ఎమ్మెల్యేలందరూ చార్టెడ్ విమానంలో ముంబయి వచ్చారు.
అయితే ఆ సమావేశం వాయిదా పడ్డంతో వారంతా సాయత్రం తిరిగి వచ్చి నేరుగా గడ్కరీ నివాసానికి వెళ్లారు. గత నెల 15న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాగపూర్ సిటీ బిజెపి అద్యక్షులు కూడా అయిన ఖోప్డే కాణగ్రెస్‌కు చెందిన ప్రముఖ అడ్వకేట్ అభిజిత్ వంజారీని 40 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడించారు. 2009లో తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేసిన ఖోప్డే అప్పటి రాష్ట్ర జౌళి శాఖ మంత్రి సతీష్ చతుర్వేదిని మట్టికరిపించి సంచలనం సృష్టించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో విదర్భ ప్రాంత ఓటర్లు బీజేపీకి తిరుగులేని మద్దతు ప్రకటించారు. ఈ ప్రాంతంలోని మొత్తం 62 స్థానాల్లో 44 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. ఇదిలా ఉండగా గడ్కరీని ముఖ్యమంత్రి చేయాలని మంగళవారం ముంబైలోబీజేపీ సీనియర్ నాయకుడు సుధీర్ ముంగంతివార్ గట్టిగా కోరారు. గడ్కరీ కోసం కృష్ణ మాత్రమే కాకుండా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తమ స్థానాలు ఖాళీ చేసేందుకు సిద్దమన్నారు. అయితే, గడ్కరీ మాత్రం సీఎం రేసులో లేనని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications