రూ.40 లక్షల లంచం: రెడ్ హ్యాండెడ్- ఎమ్మెల్యే అరెస్ట్: టోల్ ప్లాజా వద్ద సినీఫక్కీలో
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోన్న వేళ.. కర్ణాటకలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ చిక్కుల్లో పడింది. సొంత పార్టీకి చెందిన శాసన సభ్యుడు మాడల్ విరూపాక్షప్ప వ్యవహారం.. అధికార పార్టీని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఊహించినట్టే- ఆయన అరెస్ట్ అయ్యారు. ఆయన బెయిల్‌ను కర్ణాటక హైకోర్టు రద్దు చేసిన కొన్ని గంటల్లోనే ఈ వ్యవహారం చోటు చేసుకుంది. అటు ముందస్తు బెయిల్ పిటీషన్‌ను కూడా జస్టిస్ నటరాజన్ సారథ్యంలోని ఏకసభ్య ధర్మాసనం కొట్టి వేసింది.
దావణగెరె జిల్లాలోని చెన్నగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న మాడల్ విరూపాక్షప్ప- కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ ఛైర్మన్‌గా పని చేశారు. ఆ సమయంలో ఓ కాంట్రాక్ట్ ను జారీ చేసే విషయంలో 40 లక్షల రూపాయలను లంచాన్ని డిమాండ్ చేశారు. తండ్రి తరఫున విరూపాక్షప్ప కుమారుడు, బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరెజ్ బోర్డ్ చీఫ్ అకౌంటెంట్ మాడల్ ప్రశాంత్ ఈ మొత్తాన్ని తీసుకుంటూ లోకాయుక్త పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు.

ఈ కేసులో ఏ1గా మాడల్ విరూపాక్షప్ప ఇదివరకే అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన 48 గంటల్లో ఆయనకు బెయిల్ లభించింది. దీన్ని సవాల్ చేస్తూ లోకాయుక్త పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్‌ను రద్దు చేయాలంటూ పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. తాజాగా బెయిల్‌ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. విరూపాక్షప్పకు బెయిల్ మంజూరు చేయడం పట్ల సుప్రీంకోర్టు కూడా ఆరా తీసింది.
దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ ఆదేశాలను జారీ చేసిన కొద్దిసేపటికే- ముందస్తు బెయిల్ పిటీషన్‌ను హైకోర్టు రద్దు చేసింది. బెయిల్ రద్దయిన కొన్ని గంటల్లోనే విరూపాక్షప్పను పోలీసులు అరెస్ట్ చేశారు. తుమకూరు జిల్లాలోని క్యాథసంద్ర టోల్ ప్లాజా వద్ద ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకు అత్యంత ఆప్తుడనే గుర్తింపు ఉంది విరూపాక్షప్పకు. ర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ ఛైర్మన్‌గా ఆయనే నామినేట్ చేశారప్పట్లో.
తాజాగా విరూపాక్షప్ప అరెస్టుపై యడ్యూరప్ప స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. దర్యాప్తును తాను గానీ, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దిశానిర్దేశం చేయలేరని చెప్పారు. విరూపాక్షప్ప కేసుపై లోకాయుక్త విచారణ జరుపుతోందని, తదుపరి చర్యలు ఏమిటనేది వారే నిర్ణయిస్తారని అన్నారు. పార్టీ పెద్దలు గానీ, ప్రభుత్వం గానీ ఏ రకంగానూ జోక్యం చేసుకోబోదని యడ్యూరప్ప తేల్చి చెప్పారు.
-
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!











Click it and Unblock the Notifications