Karnataka Bypolls: సీఎంకు షాక్ ఇచ్చిన సొంత జిల్లా ప్రజలు, సజ్జనార్ ఓటమి, సీఎం క్లారిటి !
బెంగళూరు: శాసనసభ ఉప ఎన్నికల్లో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ కి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి కుర్చీలో కుర్చుని100 రోజుల పండుగ చేసుకోవాలని అనుకుంటున్న బసవరాజ్ బోమ్మయ్ కి ఆయన సొంత జిల్లా ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. శాసన సభ ఉపఎన్నికల్లో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ కి సవాలుగా నిలిచిన ఆయన సొంత జిల్లా హావేరి జిల్లాలోని హానగల్ నియోజక వర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించడంతో అధికార బీజేపీ నాయకులు కంగుతిన్నారు. కర్ణాటకలో రెండు శాసన సభ నియోజక వర్గాల ఉప ఎన్నికల్లో ఒకటి బీజేపీ, మరోకటి కాంగ్రెస్ సొంతం చేసుకున్నాయి. ఇక రెండు నియోజక వర్గాల్లో జేడీఎస్ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోవడంతో ఆ పార్టీ నాయకులు బయటకు రావడం లేదు. కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ, అదికాకుండా సీఎం బసవరాజ్ బోమ్మయ్ సొంత జిల్లాలోని నియోజక వర్గంలో ఆ పార్టీ నాయకుడు ఓటమిపాలు కావడంతో బీజేపీ నాయకులు బిత్తరపోయారు.

ఉప ఎన్నికల ముందు సీఎంను మార్చిన అధిష్టానం
కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేసి, ఆపరేషన్ కమలాతో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని పతనం చేసి బీజేపీని అధికారంలోకి తీసుకు వచ్చిన బీఎస్ యడియూరప్పకు వయసు అయిపోయిందనే కారణంతో ఆయన్ను మూడు నెలల క్రితం సీఎం సీటు నుంచి కిందకు దించేశారు. కర్ణాటకలో బీజేపీ వారసుడిగా అప్పటి హోమ్ మంత్రి బసవరాజ్ బోమ్మయ్ ని ముఖ్యమంత్రి కుర్చీలో కుర్చోబెట్టారు.

రెండు నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు
కర్ణాటకలోని విజయపుర జిల్లాలోని సిందగి నియోజక వర్గం, సీఎం బసవరాజ్ బోమ్మయ్ సొంత జిల్లా హావేరిలోని హానగల్ శాసన సభ నియోజక వర్గంలో ఇటీవల ఎన్నికలు జరిగాయి. మంగళవారం ఉప ఎన్నికల ఫలితాలు వెళ్లడించారు. సిందగి నియోజక వర్గంలో అధికార పార్టీకి చెందిన బీజేపీ అభ్యర్థి రమేష్ భూసనూరగె విజయం సాధించగా, హానగల్ నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థి శివరాజ్ సజ్జనార్ ఓడిపోయారు.

ఇది ఓటర్లు ఇచ్చిన తీర్పు
విజయపుర జిల్లాలోని సందగిలో బీజేపీ అభ్యర్థి రమేష్ భూసనూరుగెకి 93, 865 ఓట్లు రాగా, ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అశోక్ మనగూళిగెకి 62,680 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అశోక్ మీద బీజేపీ అభ్యర్థి రమేష్ 31, 165 ఓట్ల మెజారిటితో విజయం సాధించారు .ఇక జేడీఎస్ పార్టీ టిక్కెట్ తో పోటీ చేసిన నాజియా అంగడికి కేవలం 4, 353 ఓట్లు రావడంతో డిపాజిట్లు కోల్పోయారు.

సీఎంకు సొంత జిల్లాలో షాక్
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ సొంత జిల్లా హావేరిలోని హానగల్ నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థి శివరాజ్ సజ్జనార్ కు 79,515 ఓట్లు రాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస మానెకి 87, 113 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి శివరాజ్ సజ్జనార్ మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ మానె 7, 598 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక జేడీఎస్ పార్టీ అభ్యర్థి నియాజ్ షేక్ కు కేవలం 921 ఓట్లు రావడంతో డిపాజిట్లు కోల్పోయారు. కనీసం వెయ్యి ఓట్లు కూడా రాకపోవడంతో జేడీఎస్ పార్టీ నాయకులు కంగుతిన్నారు.

సీఎం బసవరాజ్ బోమ్మయ్ ఏం చెప్పారంటే ?
శాసన సభ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత సీఎం బసవరాజ్ బోమ్మయ్ కేఆర్ఎస్ డ్యామ్ లో కావేరి తల్లి (కావేరి నది)కి బాగినం సమర్పించి మీడియాతో మాట్లాడారు. హానగల్ నియోజక వర్గంలో బీజేపీ, కాంగ్రెస్ మద్య పోటీ జరగలేదని, శ్రీనివాస మానె, శివరాజ్ సజ్జనార్ మద్య పోటీ జరిగిందని, రెండు మూడు సంవత్సరాల నుంచి శ్రీనివాస మానె అక్కడ కస్టపడి పని చేశాడని ,అందుకే ఆయన విజయం సాధించారని, ఇది కాంగ్రెస్ విజయం కాదని సీఎం బసవరాజ్ బోమ్మయ్ అన్నారు.
Recommended Video

పార్టీకి సంబంధం లేదని చెప్పిన సీఎం !
అయితే ఇక ముందు ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటామని చెప్పిన సీఎం బసవరాజ్ బోమ్మయ్ ఓటిమిని పార్టీకి సంబంధం లేదని పరోక్షంగా చెప్పారు. సొంత జిల్లాలో ఓటమిని ఆంగీకరించకుండా వ్యక్తుల మీద వెయ్యడానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ ప్రయత్నించారు.












Click it and Unblock the Notifications