బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాసలీలల సీడీ వ్యవహారం : హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు ఆ యువతి లేఖ... సిట్‌పై సంచలన ఆరోపణలు...

|
Google Oneindia TeluguNews

కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జర్కిహోళి రాసలీలల సీడీ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. ఆ సీడీలో ఉన్న యువతి తాజాగా కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ అభయ్ శ్రీనివాస్‌కు లేఖ రాశారు. తన కేసుపై విచారణ చేపట్టాలని కోరిన యువతి... ప్రభుత్వం నుంచి తనకు భద్రత కల్పించాలని న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు.అంతేకాదు,రమేష్ జర్కిహోళి నుంచి తనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు బృందం రమేష్ జర్కిహోళితో కుమ్మక్కైందని సంచలన ఆరోపణలు చేశారు.

రమేష్ జర్కిహోళి నుంచి ప్రాణహాని...

రమేష్ జర్కిహోళి నుంచి ప్రాణహాని...


'ఈ కేసు విచారణ చేపట్టాలని నేను కోర్టును వేడుకుంటున్నాను. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నాకు భద్రత కల్పించేలా ఆదేశాలివ్వాలని కోరుతున్నాను. నాకు జర్కిహోళి నుంచి ప్రాణహాని ఉంది.
ఆయన తనకున్న పలుకుబడిని ఉపయోగించి కేసును ప్రభావితం చేయగలరు. ఇప్పటికే ఓసారి బహిరంగంగానే నన్ను బెదిరించారు. కేసు నుంచి బయటపడేందుకు ఆయన ఎంత దూరమైనా వెళ్లగలరు... ఏమైనా చేయగలరు...' అని ఆ యువతి హైకోర్టు న్యాయమూర్తికి రాసిన లేఖలో పేర్కొన్నారు. సీడీలో ఉన్న ఆ యువతి ఒకవేళ శవమై కనిపిస్తే దానికి కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌దే బాధ్యత అని గతంలో రమేశ్ జర్కిహోళి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

నన్ను ఏ క్షణమైనా చంపవచ్చు...

నన్ను ఏ క్షణమైనా చంపవచ్చు...

'రమేశ్ జర్కిహోళి,అతని అనుచరుల నుంచి నాకు,నా కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయని ఇదివరకే చెప్పాను. కాబట్టి నాకు,నా కుటుంబానికి భద్రత కల్పించాలని కోరుతున్నాను. నా తల్లిదండ్రులను బెదిరించి బలవంతంగా వారితో సిట్‌కు వాంగ్మూలం ఇప్పించారు. రమేష్ జర్కిహోళి కనుసన్నుల్లోనే సిట్ దర్యాప్తు జరుగుతోంది. ప్రభుత్వం ఆయన్ను రక్షించేందుకు ప్రయత్నిస్తోంది. రమేష్ జర్కిహోళి నన్ను ఏ క్షణమైనా,ఎక్కడైనా చంపే అవకాశం ఉంది. కేసుకు సంబంధించి ఎక్కడా ఏ ఆధారం లేకుండా చేయగలడు.' అని ఆ యువతి చెప్పుకొచ్చారు.

యువతి అజ్ఞాతం వీడుతున్నట్లు ప్రచారం... కానీ

యువతి అజ్ఞాతం వీడుతున్నట్లు ప్రచారం... కానీ


మంత్రి రమేష్ జర్కిహోళి ఓ యువతితో సాగిస్తున్న రాసలీలల సీడీ ఈ నెల 2న వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి యువతిని ఆయన లొంగదీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవడంతో జర్కిహోళి మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పలేదు. మరోవైపు ఆ సీడీ విడుదలైనప్పటి నుంచి అందులో ఉన్న యువతి అజ్ఞాతంలోనే ఉన్నారు. అజ్ఞాతం నుంచే పలు వీడియోలు విడుదలతో రమేష్ జర్కిహోళిపై ఆరోపణలు గుప్పించారు. నిజానికి ఆదివారం(మార్చి 28) ఆమె కోర్టు ఎదుట హాజరవుతారని భావించినప్పటికీ అలాంటిదేమీ జరగలేదు.

English summary
The woman in the CD case involving former Karnataka minister Ramesh Jarkiholi has written to the Karnataka High Court Chief Justice Abhay Shreeniwas Oka and requested the court to hear her case. In a letter to the Karnataka HC chief justice, the woman in the CD case has requested the court to direct the state government to provide her protection and supervise the investigation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X