రూ. 6 కోట్ల కొత్త నోట్లు, 7 కిలోల బంగారు: తేలీదు, సీఎం

బెంగళూరులో ఐటీ అధికారుల దాడుల్లో చిక్కిన రూ. 4.70 కోట్ల విలువైన రూ. 2,000 నోట్లు మైసూరు, తమిళనాడులోని ఈరోడ్, బెంగళూరులోని బ్యాంకుల్లో డ్రా చేశారని వెలుగు చూసింది.

బెంగళూరు/బెళగావి: బెంగళూరు నగరంలో ఆదాయ పన్ను (ఐటీ) అధికారుల దాడిలో చిక్కిన రూ. 4.70 కోట్ల కొత్త నోట్లతో సహ రూ. 6 కోట్లు, 7 కిలోల బంగారు బిస్కెట్లు, నగలు ఎక్కడి నుంచి తీసుకు వచ్చారు ? ఎవరు తెచ్చారు ? ఎలా వచ్చింది ? అని అధికారులు ఆరా తీస్తున్నారు.

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఆప్తులైన కావేరీ జలమండలి ఎండీ చిక్కరాయప్ప, జాతీయ రహదారుల అభివృద్ది మండలి మేనేజింగ్ డైరెక్టర్ జయచంద్రలను శుక్రవారం వేకువ జామున వరకు ఐటీ అధికారులు విచారించారు.

అయితే ఇంత పెద్ద మొత్తంలో నగదు ఏ బ్యాంకు నుంచి తీసుకు వచ్చారు అనే విషయం మాత్రం తెలియడం లేదు. అయితే విశ్వసననీయ సమాచారం మేరకు మైసూరు. తమిళనాడులోని ఈరోడ్ లో ఉన్న బ్యాంకుల నుంచి రూ. 2,000 నోట్లు డ్రా చేశారని వెలుగు చూసింది. బెంగళూరులోని ఓ బ్యాంకులో కూడా నగదు డ్రా చేశారని ఐటీ అధికారులు గుర్తించారు.

Karnataka Chief Minister Siddaramaiah, Income Tax raid case

మాకు సంబంధం లేదు: సీఎం సిద్దరామయ్య

బెళగావిలో జరుగుతున్న శీతలకాల సమావేశాలలో బీజేపీ నాయకులు బెంగళూరులో జరిగిన ఐటీ దాడుల విషయంలో సమాధానం చెప్పాలని అధికార కాంగ్రెస్ పార్టీని గట్టిగా నిలదీశారు. ఈ దెబ్బతో కాంగ్రెస్ నాయకులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

ఈ విషయంపై సీఎం సిద్దరామయ్య స్పందిస్తూ కావేరీ జలమండలి ఎండీ చిక్కరాయప్ప, జాతీయ రహదారుల అభివృద్ది మండలి మేనేజింగ్ డైరెక్టర్ జయచంద్రలకు తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.

Karnataka Chief Minister Siddaramaiah, Income Tax raid case

బీజేపీ కావాలనే ఆ ఇద్దరు అధికారులతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పి రాద్దాంతం చేస్తున్నదని ఆరోపించారు. అయితే ఐటీ అధికారుల దాడుల కేసు సీబీఐతో దర్యాప్తు చేయించాలని ప్రతిపక్ష పార్టీ బీజేపీ పట్టుబడుతున్నది.

విషయం తెలుసుకున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం బెంగళూరు చేరుకుని ఈ అక్రమ ఆస్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+