కర్ణాటక సీఎంకు కరోనా.. మైల్డ్ సింప్టమ్స్ అని ట్వీట్, క్వారంటైన్
కరోనా, ఒమిక్రాన్ వేరియంట్స్ వేగంగా సోకుతున్నాయి. ప్రముఖులు, సీఎంలు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజా కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై కూడా వైరస్ బారిన పడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని.. ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు. తాను హోం క్వారంటైన్‌లో ఉన్నానని వివరించారు. తనను ఇటివల కలిసిన వారు ఐసోలేషన్‌లో ఉండాలని.. కరోనా పరీక్ష చేయించుకోవాలని కోరారు. గత 24 గంటల్లో కర్ణాటకలో 11 వేల 698 కేసులు వచ్చాయి. యాక్టివ్ కేసులు 61 వేలు ఉన్నాయి. ఇవాళ ఒక్కరోజు కరోనాతో నలుగురు చనిపోయారు.
కరోనా కేసులు భారీగా వస్తున్నాయి. ఈ నెల ఆఖరు.. ఫిబ్రవరిలో భారీగా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రముఖులను కూడా కేసులు వదలడం లేదు. ఇటు కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అందుకు తగిన జాగ్రత్తలను తీసుకుంటుంది. ఆస్పత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు, మందులు అందుబాటులో ఉంచాలని అధికారులకు స్పష్టంచేసింది. కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పింది. ఒమిక్రాన్ వైరస్ వాయువేగంతో వ్యాపిస్తోంది. ఒకరికి సోకితే.. ఆ ఫ్యామిలీకి దాదాపుగా వస్తోంది. సన్నిహితంగా మెలిగితే చాలు వైరస్ వస్తోంది. ఇటు ఏపీ నైట్ కర్ఫ్యూ స్టార్ట్ చేసింది.

కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. దేశంలోని 27 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ వేరియంట్ వలన ప్రాణాపాయం చాలా తక్కువని, మైల్డ్ సింటమ్స్ మాత్రమే ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు.కరోనా కేసులు భారీగా వస్తున్నాయి.












Click it and Unblock the Notifications