సీఎం వెలుతున్న హెలికాప్టర్ లో మంటలు, ల్యాండింగ్ టైమ్ లో ఏం జరిగింది ?
బెంగళూరు/ఉడిపి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరోసారి విజయం సాధించాలని, తాను మరోసారి తాను సీఎం కావాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ కోరుకుంటున్నారని తెలిసింది. కొన్ని రోజుల నుంచి సీఎం బసవరాజ్ బోమ్మయ్ దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సీఎం బసవరాజ్ బోమ్మయ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో మంటలు చెలరేగడంతో అందరూ హడలిపోయారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండు జాబితాలను బీజేపీ హైకమాండ్ విడుదల చేసిన తరువాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ దక్షిణ కన్నడ జిల్లాల్లోని దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. బుధవారం ధర్మస్థలకు వెళ్లిన సీఎం బసవరాజ్ బోమ్మయ్ అక్కడ మంజునాథ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.

ధర్మస్థలం నుంచి నేరుగా కుక్కే సుబ్రమణ్యస్వామి దేవాలయానికి వెళ్లి అక్కడ సుబ్రమణ్యస్వామికి ప్రత్యేక పూజలు చేసిన సీఎం బసవరాజ్ బోమ్మయ్ టెంపుల్ రన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. శ్రీ క్షేత్రం కటీలు, కొల్లూరులోని శ్రీమూకాంబికా దేవి ఆలయాలను దర్శించుకోవడానికి సీఎం బసవరాజ్ బోమ్మయ్ వెళ్లారు.
కొల్లూరులోని శ్రీమూకంబిక దేవాలయంలో ప్రత్యేక పూజలు చెయ్యడానికి ప్రత్యేక హెలికాప్టర్ లో వెళ్లిన సీఎం బసవరాజ్ బోమ్మయ్ శిరూరు హెలిప్యాండ్ లో దిగడానికి ప్రయత్నించారు. సీఎం బసవరాజ్ బోమ్మయ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే సమయంలో అదే హెలికాప్టర్ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అందరూ హడలిపోయారు.

హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే సమయంలో మంటలు వ్యాపించడంతో సీఎం బసవరాజ్ బోమ్మయ్ తో సహ అందరూ ఏమి జరుగుతుందో అర్థం కాక హడలిపోయారని తెలిసింది. అయితే పైలెట్ చాకచక్యంగా హెలికాప్టర్ ను ల్యాండ్ చెయ్యడంతో సీఎం బసవరాజ్ బోమ్మయ్ సురక్షితంగా బయటపడటంతో బీజేపీ నాయకులతో పాటు అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
వెంటనే అగ్నిమాపక సిబ్బంది హెలిప్యాడ్ దగ్గరకు వెళ్లి మంటలు అదుపు చేశారు. సాంకేతిక లోపం కారణంగా హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే సమయంలో మంటలు వ్యాపించి ఉంటాయని అధికారులు అంటున్నారు. అయితే ఇంకా కచ్చితమైన కారణాలను అధికారులు చెప్పడం లేదని కన్నడ మీడియా అంటోంది. మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం బసవరాజ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే సమయంలో మంటలు వ్యాపించడం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications