తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

IT Hub: పెట్రోల్ మీద పన్ను తగ్గించం, పక్క రాష్ట్రాల గురించి మాకెందుకు, ప్రధాని చెప్పారు, సీఎం షాక్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ చెన్నై/ తిరుపతి: కర్ణాటకలో పెట్రోల్ మీద ఉన్న పన్ను (ట్యాక్స్) రద్దు చేసే అవకాశం లేదని, ఆ ఆలోచన చెయ్యడం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. తమిళనాడులో పెట్రోల్ మీద మూడు రూపాయల పన్ను రద్దు చేశారు కదా, మీరు ఆ దిశలో ఏమైనా ఆలోచిస్తున్నారా ? అని మీడియా ప్రశ్నించగా పక్క రాష్ట్రాల గురించి మేము ఎందుకు ఆలోచించాలి ? మా పని మేము చేస్తాము అనే టైపులో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ సమాధానం ఇచ్చారు.

అంతర్జాతీయ స్థాయిలో బెంగళూరుకు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఇదే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీతో చర్చ జరిగిందని, ఐటీ హబ్ ను మరింత అభివృద్ది చెయ్యాలని ప్రధాని నరేంద్ మోదీ తనకు చెప్పారని, మోదీ సూచనలతో ఆ దిశగా మేము అడుగులు వేస్తున్నామని బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. బెంగళూరులో నకిలి కోవిడ్ నెగటివ్ పత్రాలు ఇస్తున్నారని తనకు సమాచారం అందిందని, అలా చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వారి అంతు చూస్తామని కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ హెచ్చరించారు. త్వరలో జరగనున్న బెంగళూరు కార్పోరేషన్ (BBMP) ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటుకుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ ధీమా వ్యక్తం చేశారు.

Illegal affair: పగలు ప్రియుడికి అగ్రిమెంట్, రాత్రి భర్తతో ?, మద్యలో కూతురు ఎందుకని, కిలాడి !Illegal affair: పగలు ప్రియుడికి అగ్రిమెంట్, రాత్రి భర్తతో ?, మద్యలో కూతురు ఎందుకని, కిలాడి !

 తమిళనాడు కథ మనకు ఎందుకు మిత్రమా ?

తమిళనాడు కథ మనకు ఎందుకు మిత్రమా ?

కర్ణాటకలో పెట్రోల్ మీద ఉన్న పన్ను (ట్యాక్స్) రద్దు చేసే అవకాశం లేదని, ఆ ఆలోచన చెయ్యడం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. తమిళనాడులో పెట్రోల్ మీద రూ. 3 పన్ను రద్దు చేశారు కదా, మీరు ఆ దిశలో ఏమైనా ఆలోచిస్తున్నారా ? అని మీడియా ప్రశ్నించగా పక్క రాష్ట్రాల గురించి మేము ఎందుకు ఆలోచించాలి ? అనే టైపులో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ సమాధానం ఇచ్చారు.

 నకిలి కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ట దందా

నకిలి కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ట దందా

బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో నకిలి కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్లు ఇస్తున్నారని తనకు తెలిసిందని, అలాంటి దందాలో ఎవ్వరు ఉన్నా సరే వారి మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ హెచ్చరించారు. బెంగళూరు నగరంలోని రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో నకిలి కోవిడ్ సర్టిఫికెట్లు జోరుగా విక్రయిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతున్న సందర్బంగా కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ ఆ విషయంలో క్లారిటీ ఇచ్చారు.

హెబ్బాళ అంటేనే పవర్ ఫుల్

హెబ్బాళ అంటేనే పవర్ ఫుల్

బెంగళూరు నగరంలోని ఆర్ టీ నగర్ లోని సీఎం బసవరాజ్ బోమ్మయ్ నివాసంలో బెంగళూరు హెబ్బాళ నియోజక వర్గం బీజేపీ నాయకులు ఆయనకు సన్మానం చేశారు. ఈ సందర్బంగా సీఎం బసవరాజ్ బోమ్మయ్ మాట్లాడుతూ హెబ్బాళ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేలు అయిన ఐదు మంది నాయకులు ముఖ్యమంత్రులు అయ్యారని, కర్ణాటకలోని ప్రతి నియోజక వర్గం హెబ్బాళను ఆదర్శంగా తీసుకోవాలని బీజేపీ నాయకులకు పిలుపునిచ్చారు.

 బెంగళూరు గురించి ప్రధాని చెప్పారు..... మేము చేసి చూపిస్తాము

బెంగళూరు గురించి ప్రధాని చెప్పారు..... మేము చేసి చూపిస్తాము

అంతర్జాతీయ స్థాయిలో ఐటీ హబ్ బెంగళూరు నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉందని, ఇదే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీతో చర్చ జరిగిందని సీఎం బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. ఐటీ హబ్ బెంగళూరును మరింత అభివృద్ది చెయ్యాలని ప్రధాని నరేంద్ మోదీ తనకు సూచించారని, ఆ దిశగా మేము అడుగులు వేస్తున్నామని, కచ్చితంగా బెంగళూరును మరింత అభివృద్ది చేసి చూపిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ ధీమా వ్యక్తం చేశారు.

 బెంగళూరు టార్గెట్

బెంగళూరు టార్గెట్

బెంగళూరు త్వరలో జరగనున్న కార్పోరేషన్ (BBMP) ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటుకుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ ధీమా వ్యక్తం చేశారు. బెంగళూరులో అదిక కార్పోరేషన్ వార్డుల్లో మన పార్టీ అభ్యర్థులను గెలిపించుకుకి కార్పోరేషన్ కైవసం చేసుకోవడానికి బీజేపీ నాయకులు అందరూ కలిసి పని చెయ్యాలని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ సూచించారు. ఇదే సమయంలో కర్ణాటక మాజీ మంత్రి కట్టా సుబ్రమణ్య నాయకుడు, ఎమ్మెల్సీ ఎ. నారాయణస్వామి, హెబ్బాళ నియోజక వర్గం బీజేపీ నాయకులు, తదితరులు సీఎం బసవరాజ్ బోమ్మయ్ ని సన్మానించి కన్నడ పుస్కకాలను బహుమతిగా ఇచ్చారు.

English summary
Petrol tax: Karnataka CM Basavaraj Bommai said there was no proposal for tax reduce on Petrol in the State.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X