సీఎం ఎన్ని వేల కోట్లు లూటీ చేశారంటే ?, సొంత పార్టీ ఎమ్మెల్యే సంచలనం, ధైర్యం ఉంటే ?

బెంగళూరు/హావేరి: అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నాయకులు సొంత పార్టీ నాయకుల మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే నెహరు ఓలేకార్ కు మరోసారి పోటీ చేసే చాన్స్ ఇవ్వకపోవడంతో ఆయన ఏకంగా సీఎం బసవరాజ్ బోమ్మయ్ ని టార్గెట్ చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ నీటిపారుదల శాఖకు చెందిన రూ. 1,500 కోట్లు డబ్బులు లూటీ చేసి ఆయన జోబులోకి వేసుకున్నారని బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నెహరూ ఓలేకార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యే నెహరు ఓలేకార్ ఆరోపణలను హైలెట్ చేసిన జేడీఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో లబ్దిపొందడానికి ప్రయత్నిస్తున్నది.

basavarajbommai

బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నెహరూ ఓలేకార్ సీఎం బసవరాజ్ బోమ్మయ్ మీద చేసిన ఆరోపణలను జేడీఎస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ పోస్టు చేసి దానిని వైరల్ చేస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే నెహరు ఓలేకార్ ఆరోపణలు పరిశీలిస్తే సీఎం బసవరాజ్ బోమ్మయ్ 40 శాతం కమీషన్ సీఎం కాదని, ఆయన 99 శాతం కమీషన్ సీఎం అని అర్థం అవుతోందని జేడీఎస్ పార్టీ ఆరోపించింది.

అసెంబ్లీ ఎన్నికల ముసుగులో పదేపదే కర్ణాటకకు వస్తున్న బీజేపీ హైకమాండ్ నాయకులు ఇక్కడి 40 శాతం కమీషన్ తీసుకుంటున్న బీజేపీ ప్రభుత్వం ఇస్తున్న మూటలు మూటలు డబ్బులు ఎత్తుకుని వెళ్లి ఢిల్లీలోని బీజేపీ ఖజానా నింపుకుంటున్నదని జేడీఎస్ పార్టీ ఆరోపిస్తున్నది. తనకు ఎమ్మెల్యే సీటు రాకపోవడానికి సీఎం బసవరాజ్ ప్రధాన కారణం అని సిట్టింగ్ ఎమ్మెల్యే నెహరూ ఓలేకార్ ఏకవచనంతో సీఎం బసవరాజ్ బోమ్మయ్ మీద ఆరోపణలు చేశారు.

basavarajbommai

బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలపై సీఎం బసవరాజ్ బోమ్మయ్ స్పందించారు. తన మీద లేనిపోని ఆరోపణలు చెయ్యడం సరికాదని, తాను రూ. 1,500 కోట్లు లూటీ చేశానని మీ దగ్గర సాక్షాలు ఉంటే వాటిని బయటపెట్టాలని నెహరూ ఓలేకార్ కు సవాలు చేశారు. ఎన్నికలు పూర్తి అయిన తరువాత ఎవరు ఎంత లూటీ చేశారో అంతా బయటకు వస్తుందని జేడీఎస్ పార్టీ నాయకులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+