బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus Lockdown:గుడ్ న్యూస్, బెంగళూరులో లాక్ డౌన్ సడలింపు, అయితే, సీఎం అప్ప !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) కట్టడికి దేశం మొత్తం మే 3వ తేదీ వరకు రెండో విడత లాక్ డౌన్ పొడగించారు. కర్ణాటకలో ఏప్రిల్ 20వ తేదీ నుంచి లాక్ డౌన్ నియమాలను సడలిస్తున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప చెప్పారు. లాక్ డౌన్ సడలింపుపై మంత్రి వర్గ సమావేశంలో, అధికారుల సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నామని సీఎం యడియూరప్ప చెప్పారు. అయితే లాక్ డౌన్ నియమాలు సడలించినా ప్రజలు. సదరు సంస్థలు ప్రభుత్వం విదించే నియమాలను పాటించాలని, ఎవరైనా నియమాలు ఉల్లంఘిస్తే అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప హెచ్చరించారు.

Coronavirus Patient:బెంగళూరులో ఇన్ఫోసిస్ భవనం ఖాళీ, ఉద్యోగుల క్షేమం!Coronavirus Patient:బెంగళూరులో ఇన్ఫోసిస్ భవనం ఖాళీ, ఉద్యోగుల క్షేమం!

సీఎం, మంత్రులు, అధికారులు

సీఎం, మంత్రులు, అధికారులు

కర్ణాటకలో ఏప్రిల్ 20వ తేదీ నుంచి లాక్ డౌన్ నియమాలను సడలించాలమని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప శనివారం ఆదేశాలు జారీ చేశారు. అంతకు ముందు బెంగళూరులో సీఎం బీఎస్. యడియూరప్ప ఆధ్వర్యంలో సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. కరోనా వైరస్ కట్టడికి తీసుకోవలసిన జాగ్రత్తలపై సీఎం యడియూరప్ప సీనియర్ మంత్రులు, అధికారులతో చర్చించారు.

కరోనా కంటోన్మెంట్ జోన్లు

కరోనా కంటోన్మెంట్ జోన్లు

కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను అధికారులు గుర్తించారని సీఎం యడియూరప్ప గుర్తు చేశారు. కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కంటోన్మెంట్ జోన్లుగా గుర్తించి అక్కడ ప్రత్యేక అధికారులును నియమిస్తామని సీఎం యడియూరప్ప అన్నారు. కరోనా వైరస్ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులకు ప్రత్యేక అధికారులు ఇస్తామని సీఎం యడియూరప్ప వివరించారు.

లాక్ డౌన్ మరింత కఠినం

లాక్ డౌన్ మరింత కఠినం

కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపించిన ప్రదేశాల్లో లాక్ డౌన్ నియమాలు మరింత కఠినం చెయ్యాలని సీఎం యడియూరప్ప అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కరోనా బఫర్ జోన్లలో మరన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అన్నారు. సీనియర్ సిటిజన్లు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, అవసరమైతే వారు బయటకు వచ్చే సమయంలో కచ్చితంగా ముఖానికి మాస్క్ లు వేసుకోవాలని సీఎం యడియూరప్ప అన్నారు.

బెంగళూరు, బెంగళూరు గ్రామీణ, రామనగర జిల్లాలు

బెంగళూరు, బెంగళూరు గ్రామీణ, రామనగర జిల్లాలు

పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, టౌన్ షిప్ లో ఏప్రిల్ 20వ తేదీ నుంచి ప్రభుత్వ నియమాలు పాటించి కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి అవకాశం ఇస్తున్నామని సీఎం యడియూరప్ప అన్నారు. ఈ కార్యకలాపాలు సవ్యంగా జరగడానికి బెంగళూరు సిటీ, బెంగళూరు గ్రామీణ, రామనగర జిల్లాలను అంతర జిల్లాలుగా పరిగణించి ఒకే జిల్లాగా గుర్తిస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప వివరించారు.

రోడ్లలో ఉమ్మితే అంతే సంగతి !

రోడ్లలో ఉమ్మితే అంతే సంగతి !

ఏప్రిల్ 20 తేదీ నుంచి ప్రభుత్వ నియమాలు పాటించి ప్రభుత్వం సూచించిన కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని సీఎం యడియూరప్ప అన్నారు. మే 3వ తేదీ వరకు కర్ణాటక మొత్తం 144 సెక్షన్ అమలులో ఉంటుందని, అందులో ఎలాంటి మార్పులు లేవని సీఎం యడియూరప్ప చెప్పారు. రోడ్లలో ఎక్కడపడితే అక్కడ ఉమ్మి వేస్తే అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారని సీఎం యడియూరప్ప ప్రజలను హెచ్చరించారు.

ఐటీ కంపెనీలకు ఇవే షరతులు

ఐటీ కంపెనీలకు ఇవే షరతులు

ఐటీ, బీటీ సంస్థలు వారి కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి షరతులతో అనుమతులు ఇచ్చామని సీఎం యడియూరప్ప అన్నారు. కంపెనీల్లో 33 శాతం మంది ఉద్యోగులు మాత్రమే హాజరు కావాలని, ఆ ఉద్యోగులు అందరూ సమదూరం పాటించాలని సూచించామని సీఎం యడియూరప్ప వివరించారు. అయితే కరోనా కంటోన్మెంట్ ప్రాంతాల్లో ఇళ్ల నుంచి ఎవ్వరూ బయటకు రాకూడదని, వారికి ఈ నియమాలు వర్తించవని సీఎం యడియూరప్ప స్పష్టం చేశారు.

బెంగళూరులో బైక్ సంచారానికి ఓకే, అయితే ?

బెంగళూరులో బైక్ సంచారానికి ఓకే, అయితే ?

బెంగళూరు నగరంలో ఏప్రిల్ 20వ తేదీ నుంచి బైక్ లో ఒక్కరు మాత్రం సంచరించడానికి అవకాశం ఇచ్చామని, ఇద్దరు సంచరించడానికి అనుమతి లేదని సీఎం యడియూరప్ప అన్నారు. బెంగళూరు నగరం బయట బైక్ లో సంచరించడానికి మాత్రం అవకాశం లేదని సీఎం యడియూరప్ప చెప్పారు. అంతే కాకుండా ఇ పాస్ లు ఉన్నవారు సైతం బెంగళూరు సిటీ దాటి బయటకు వెళ్లడానికి అంగీకరించమని, ఎవరైనా ప్రభుత్వ నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం యడియూరప్ప హెచ్చరించారు.

Recommended Video

TikTok Users Beware, TikTok Addiction Leads To Lost Life
కుమారస్వామి కొడుకు పెళ్లి లో !

కుమారస్వామి కొడుకు పెళ్లి లో !

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామి కొడుకు నిఖిల్ వివాహం గురించి మాట్లాడిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెళ్లి నియమాల ప్రకారమే జరిగిందని అన్నారు. మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ కుటుంబం చాలా పెద్దదని, వివాహం జరిపించడానికి ప్రభుత్వం ఎంత మందికి అనుమతి ఇచ్చిందో అంతమంది మాత్రమే హాజరైనారని సీఎం యడియూరప్ప అన్నారు. నియమాలు కచ్చితంగా పాటించి కొడుకు నిఖిల్ పెళ్లి జరిపించిన మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామిని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అభినందించారు.

English summary
Coronavirus Lockdown: Karnataka Chief Minister BS Yediyurappa has ordered the relaxation of the Corona lockdown rule from April 20 in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X