తొక్కలో పంచాయితి, తమిళనాడుకు చుక్క నీళ్లు వదలం, మాకు దిక్కులేదు, సీఎం సీరియస్ !
బెంగళూరు తీవ్ర నీటి సమస్యతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ కావేరీ నీటిని తమిళనాడుకు విడుదల చేస్తున్నారనే ప్రతిపక్ష పార్టీ బీజేపీ చేస్తున్న ఆరోపణలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొట్టిపారేశారు. బీజేపీ చేస్తున్న ఆరోపణలు అబద్ధమని, తమిళనాడుకు చుక్క నీరు ఇవ్వడం లేదనని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు.
కావేరీ నీటిని విడుదల చేయాలని తమిళనాడు అడగలేదని, కర్ణాటకకు నీరు విడుదల చేయాలని మాకు ఎవరూ సూచించలేదని సీఎం సిద్దరామయ్య అన్నారు. బీజేపీ చెబుతున్నది అంతా అబద్ధం, బెంగళూరులో నీటి సమస్య ఎక్కువగా ఉందని, ఇలాంటి పరిస్థితిలో తమిళనాడుకు నీళ్లు ఎవరు వదులుతారు? సొంత అవసరాలకు నీటిని పొదుపు చేయకుండా తమిళనాడుకు చుక్క నీరు కూడా ఇవ్వబోమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు.
సీఎం సిద్దరామయ్య విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ నాయకులు పనిపాటలేకుండా మా ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కావేరీ నీటిని విడుదల చేయమని తమిళనాడు మమ్మల్ని అడగలేదని సీఎం సిద్దరామయ్య చెప్పారు, పక్క రాష్ట్రం మాకు నీటిని విడుదల చేయాలని (తమిళనాడు) అడగలేదని, కావేరీ నీటిని తమిళనాడుకు వదలాలని కర్ణాటక ఎవ్వరూ సూచించలేదని, అలాంటప్పుడు తమిళనాడుకు మేము ఎందుకు కావేరీ నీరు విడుదల చేస్తామని సీఎం సిద్దరామయ్య బీజేపీ నాయకులను ప్రశ్నించారు.
వాళ్లు అడగనప్పుడు తమిళనాడుకు నీళ్లు ఎందుకు ఇస్తున్నామని, ఇవ్వడానికి మన దగ్గర నీళ్లు ఎక్కడ ఉన్నాయని, కేంద్రం ఆదేశాలు ఇచ్చినా తమిళనాడుకు చుక్క నీళ్లు ఇచ్చే ప్రసక్తేలేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుండలుబద్దలు కొట్టినట్లు చెప్పారు. కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేస్తోందని ఇటీవల కర్ణాటక శాసనసభలోని ప్రతిపక్ష నేత ఆర్. అశోక్ ఆరోపించారు.

బీజేపీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని సీఎం సిద్ధరామయ్య అన్నారు. బెంగళూరులో తీవ్ర తాగునీటి సమస్య ఉందని, తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నామని, అయితే నీరు తమిళనాడుకు విడుదల చెయ్యడం లేదని, బెంగుళూరుకు తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నామని సీఎం సిద్దరామయ్య స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications