Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Infosys మూర్తి దంపతులపై ఆగ్రహావేశాలు

దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, ఆయన భార్య సుధామూర్తిపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఘాటు విమర్శలు చేశారు. సామాజిక, విద్యా సర్వేలో పాల్గొనకపోవడం పట్ల తీవ్రంగా స్పందించారు. వారి నిర్ణయాన్ని తప్పుపట్టారు. ప్రభుత్వం చేపట్టిన సర్వేను బహిష్కరించినట్టయిందని వ్యాఖ్యానించారు. తాము చేపట్టిన ఈ సర్వే రాష్ట్ర, జాతీయ ప్రయోజనాల కోసమేనని పేర్కొన్నారు.

ప్రస్తుతం కర్ణాటకలో సామాజిక, విద్యా సర్వే చురుగ్గా సాగుతోంది. లక్షలాది మంది టీచర్లు, ఇతర ప్రభుత్వ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఇందులో పాల్గొంటోన్నారు. దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది సిద్ధరామయ్య ప్రభుత్వం. సర్వే కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు ఈ నెల 8 నుంచి 18వ తేదీ వరకు సెలవులు సైతం ఇచ్చింది. ఇంకో నాలుగైదు రోజుల్లో సర్వే ముగియాల్సి ఉంది. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్యా స్థితిగతులను తెలుసుకోవడానికి దీన్ని చేపట్టింది.

Karnataka CM Shares Insights on Infosys Founders Narayana Murthy and Sudha Murthy

ఇందులో నారాయణమూర్తి, సుధామూర్తి పాల్గొనట్లేదు. దీన్ని తప్పుపట్టారు. రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని సుధామూర్తి వ్యాఖ్యానించారు. బీసీల గురించి తెలుసుకోవడానికే ఇది జరుగుతోందని పేర్కొన్నారు. సర్వే సిబ్బంది వారి నివాసానికి వెళ్ళినప్పుడు తమ వివరాలను వెల్లడించడానికి నిరాకరించారు. సర్వే చేయించుకోవాలనుకోవట్లేదని స్పష్టం చేశారు. తాము ఏ వెనుకబడిన వర్గానికి చెందినవారం కాదని, అలాంటి వర్గాల కోసం ఉద్దేశించిన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనబోమని అన్నారు.

లిఖితపూరకంగా సిబ్బందికి రాసిచ్చారు కూడా. ఈ సర్వేకు ఎటువంటి ప్రాముఖ్యత లేదని, దీనివల్ల రాష్ట్ర ప్రజలకు ఉపయోగం లేదని సుధామూర్తి అన్నారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లపై సంతకం కూడా చేసినట్లు సమాచారం. అలాగే ఓ సెల్ఫ్ డిక్లరేషన్ సైతం ఇచ్చారు. దీనిపై ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. సర్వేలో పాల్గొనాలని ఎవరినీ బలవంతం చేయట్లేదని అన్నారు.

ఈ వ్యవహారంపై తాజాగా సిద్ధరామయ్య స్పందించారు. ఇది వెనుకబడిన వర్గాల కోసం చేపట్టిన సర్వే కాదని తేల్చి చెప్పారు. జనాభా లెక్కింపుగా అభివర్ణించారు. ఇందులో పాల్గొనకపోవడం సరికాదని పేర్కొన్నారు. ఇది బీసీల కోసం నిర్వహిస్తోన్న సర్వే కాదని, వాళ్ళు అర్థం చేసుకోకపోతే తానే చేయగలనని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. ఇన్ఫోసిస్ వాళ్లైనంత మాత్రాన అన్నీ తెలిసిపోతాయా? అని ప్రశ్నించారు. ఇది వెనుకబడిన తరగతుల సర్వే కాదని ఇప్పటికే ఓ 20 సార్లు చెప్పానని గుర్తు చేశారు.

అయినప్పటికీ ఇది బీసీ సర్వే అని వాళ్లు చెబుతుంటే తానేం చేయగలనని పేర్కొన్నారు. దీన్ని నారాయణ మూర్తి దంపతులు బీసీల సర్వే అని భావిస్తున్నారని, అది తప్పు అని తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా సర్వే నిర్వహిస్తోంది కదా. దీనిపై వాళ్ళు ఏం చెబుతారు. తాము చేపట్టిన సర్వేపై బహుశా వాళ్ళకు తప్పుడు సమాచారం అంది ఉండొచ్చు అని సిద్ధరామయ్య పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+